పైల్స్ సమస్య చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళితే వారు పడే బాధ మామూలుగా ఉండదు. అలాంటి వారు ఈ చిన్న, చిన్న చిట్కాలను పాటించి.. ఈ పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఓ నిమ్మకాయను తీసుకొని రసం పిండుకోవాలి.. దాంట్లో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తే ఉపశమనం లభిస్తుంది.
ఓ పాత్రలో నీళ్లను తీసుకుని కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్), రెండు మూడు వెల్లులి రెబ్బలు వేసి బాగా మరిగబెట్టి.. ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాయాలి. రోజుకు మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని.. కాటన్ బాల్స్ ముంచి ఇబ్బంది ఉన్న చోట రాయాలి. అలా చేసినా పైల్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
మనకు దొరికే తెల్ల చామంతి పువ్వును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికార్షన్ కాయాలి. దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి.
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. తర్వాత వాటిని తీసి ఇబ్బంది ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.