ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ సమస్య చాలా మందికి ఉంటుంది. కొన్ని తేలికపాటి అలర్జీలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..

టీ ట్రీ ఆయిల్‌

టీ ట్రీ ఆయిల్ చర్మ అలెర్జీలను నివారించడానికి చాలా బాగా పని చేస్తుంది.

టీ ట్రీ ఆయిల్‌

టీ ట్రీ ఆయిల్‌‌లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌‌‌‌‌

యాపిల్‌ సైడర్‌ వెనిగర్ చర్మ సంరక్షణకు గొప్ప ఏజెంట్‌గా పని చేస్తుంది. 

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌‌‌‌‌

ఇందులో ఉండే ఎసిటిక్‌ యాసిడ్‌‌ చర్మంపై దురదలను, అలెర్జీల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఎలా వాడాలంటే..

ఒక కప్పు వెచ్చని నీటిలో, ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి.

ఇప్పుడు కాటన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.

ఇప్పుడు దానిని కొంతసేపు ఆరనివ్వండి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే..స్కిన్‌ అలర్జీ దూరం అవుతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పని చేస్తుంది.

కొబ్బరి నూనె

దీనిలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు అలెర్జీలను తగ్గిస్తాయి. 

ఎలా వాడాలంటే..

ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని 5 సెకన్ల పాటు కొద్దిగా వేడి చేయండి.

తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి.

దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి.

మీరు 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.

అలెవెరా జెల్‌

స్కిన్ అలర్జీలను తగ్గించడానికి కలబంద సహాయపడుతుంది. 

అలెవెరా జెల్‌

అలర్జీ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

ఎలా వాడాలంటే..

అలర్జీ ఉన్న ప్రదేశంలో తాజా కలబంద గుజ్జును చర్మానికి అప్లై చేయాలి. 

కలబంద లేదా అలోవెరా జెల్‌ను అప్లై చేసి 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే ఉంచితే, దురద, మంట నుంచి కొద్ది రోజుల్లో ఉపశమనం పొందవచ్చు.

బేకింగ్‌ సోడా

చర్మ అలర్జీలను తగ్గించడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. 

బేకింగ్‌ సోడా

అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

బేకింగ్‌ సోడా

బేకింగ్‌ సోడా చర్మం పిహెచ్‌ను బ్యాలెన్స్‌ చేయడానికి సహాయపడుతుంది.

ఎలా వాడాలంటే..

ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీరు కలపాలి.

ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసి అలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 

10 నిమిషాల తర్వాత కడిగేయండి. 

రోజుకు 3 నుంచి 4 సార్లు ఈ పేస్ట్‌ అప్లై చేస్తే.. అలెర్జీ తర్వగా తగ్గుతుంది.