భారత టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టాక చోటుచేసుకున్న పరిణామాలు అందరకి తెలిసినవే.

జియో రాకముందు.. ఎవరికైనా కాల్ చేయాలంటే.. నిమిషానికి రూపాయి లేదా సెకనుకు పైసా చొప్పున చెల్లించాల్సి వచ్చేది.

దీంతో నెలకు నాలుగుసార్లు వంద చొప్పున రీచార్జ్ చేస్తుండేవారు. కానీ జియో వచ్చాక ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది.

నెలకు రూ. 200 రూపాయలు చెల్లిస్తే.. నెల మొత్తం కాల్ చేసుకునే వెసులుబాటుతో పాటు అపరిమిత డేటా అందిస్తుండడంతో కాస్త ఉపశపనం లభించినట్లైంది.

అయితే.. రోజుకో కొత్త ప్లాన్ ప్రవేశపెడుతుండడంతో వినియోగదారులు..

ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు.

కేవలం.. రూ.10, రూ.20 మాత్రమే రీచార్జ్ ప్లాన్స్ మధ్య తేడా ఉంటుండడంతో..

ఏదొకటిలే అని రీఛార్జ్ చేసుకొని వినియోగదారులు నష్టపుతున్నారు.

అలా కొందరు కస్టమర్లు 20 రూపాయలకే 20జీబీ ఎక్సట్రా డేటా పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు.

ఆ ప్లాన్స్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

వాస్తవానికి.. జియో రూ. 499 మరియు రూ. 479 రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

ఈ రెండు ప్లాన్‌ల మధ్య తేడా కేవలం 20 రూపాయల మాత్రమే. రూ. 499 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

ఇందులో ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ విధంగా మీరు మొత్తం 28 రోజుల్లో 56జీబీ డేటాను పొందుతారు.

అలాగే.. రూ. 479 ప్లాన్ గురించి మాట్లాడితే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఇందులో ప్రతిరోజూ 1.5 GB డేటా లభిస్తుంది.

అంటే.. మొత్తం 56 రోజుల్లో 84జీబీ డేటా పొందుతారు. చూశారుగా.. రోజుకు 0.5 డేటా కోసం 28 రోజుల వ్యాలిడిటీ కోల్పోవడమే కాకుండా.. 20 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాం.

కనుక రీఛార్జ్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి.

ఈ రెండు ప్లాన్‌లలో డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్లఎంఎస్ లు లభిస్తాయి.

కాకుంటే.. రూ. 499 ప్లాన్ లో సంవత్సరం పాటు Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ఈ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.