గేమర్స్ కోసం అదిరిపోయే ఆసుస్ ఫోన్లు వచ్చేశాయ్!

గేమర్స్ కోసం ఆసుస్ రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో లాంఛ్ చేసింది.ఎంతో హిట్ అయిన రోగ్ 5 సిరీస్ కు కొనసాగింపుగా వీటిని తీసుకొచ్చింది.

ఆసుస్ రోగ్ ఫోన్ 6, ఆసుస్ రోగ్ ఫోన్ 6 ప్రో అనే రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే... రోగ్ ఫోన్ 6లో 12జీబీ ర్యామ్ +256జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. దీని ధర రూ.71,999గా కంపెని నిర్ణయించింది. 

ఆసుస్ ఫోన్ 6 ప్రోలో 18జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధరను 89,999గా  ఆసుస్ ఫోన్ 6 ప్రో... కేవలం స్ట్రామ్ వైట్ రంగులోనే విడుదల చేసింది.

రెండూ 6,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యమున్న మొబైల్లే. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. 

ఈ రెండు ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్ మీద వని చేస్తాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను కలిగి ఉన్నాయి. . గేమ్ కూల్ 6 కూలింగ్ సిస్టమ్ రెండు ఫోన్లలోనూ ఉంటుంది.

ఈ ఫోన్లకి వెనుక వైపు మూడు  'కెమెరాల సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా,13 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.  ఫ్రంట్ కెమెరా 12 ఎంపీ .

165 హెర్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, రోగ్ ట్యూనింగ్ టెక్నాలజీతో కూడిన 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+సూపర్ AMOLED డిస్ ప్లేతో ఈ రెండు మొబైళ్లు వస్తున్నాయి.

'గేమ్ కంట్రోలర్స్ లా ఉపయోగించుకునేందుకు ఎయిర్ ట్రిగర్ అలా సోనిక్ బటన్స్ ఈ ఫోన్లకు ఉంటాయి. సూవర్ లైనీర్ డ్యుయల్ ఫేసింగ్ | స్పీకర్లున్నాయి.

ఈ రెండు ఫోన్లకు  ప్రధాన తేడా బ్యాక్ ప్యానెల్. రోగ్ ఫోన్ 6 ప్రోమోడల్ బ్యాక్ ప్యానెలకు PMOLEDడిస్ ప్లే ఉంటుంది. ప్రో కాని మోడలకు రోగ్ లోగో ఉంటుంది.