తేనెసీసాలో రెండుమూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చీమలుకూడా పట్టవు.

దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి

దోసెలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి

నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్‌ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి

వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని ఎండలో కొద్ది సేపు ఉంచండి

అరటిపళ్ళను ఫ్రిజ్ లో ఉంచకూడదు.

పప్పుధాన్యాలు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి.

పచ్చిమిరపకాయలు పండకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండతగిలేలా ఉంచాలి.

పెరుగు రుచిగా, సరిగ్గా తోడుకోవాలంటే, తోడు పెట్టేముందు గిన్నెను పటిక ముక్కతో రుద్దండి

తోడుపెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్కవేస్తే పెరుగు కమ్మగా ఉంటుంది.

నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పుదానిలో వేశారంటే నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది.

 ఫ్రిజ్‌లో అక్కడక్కడ పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.

దోసకాయ ముక్కలు క్రష్‌ చేసి కిచెన్‌ చుట్టు ప్రక్కల ఉంచారంటే, బొద్దింకలు దూరం దూరం.