వాట్సాప్ వాడకం అన్నది ప్రజల నిత్యావసరం అయిపోయింది. రోజులో ఒక పది నిమిషాలు కూడా వాట్సాప్ వాడకుండా ఉండలేని వాళ్లు కూడా ఉన్నారు.
రోజు, రోజుకు వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇక, వాట్సాప్ కూడా తమ యూజర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫీచర్లను, పాత ఫీచర్లకు సంబంధించిన అప్డేట్లను అందుబాటులోకి తెస్తోంది.
వారికి ఓ మంచి అనుభవాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ మరో కొత్త అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగా వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు.. సింగిల్ చాట్ రూముల్లో కావచ్చు.
పెద్ద సంఖ్యలో మెసేజ్లు పెరుకుపోతూ ఉంటాయి. అవసరమున్నవయితే పర్వాలేదు.
కానీ, అనవసరమైన మెసేజ్లు కుప్పలుగా పెరుకుపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ డిసప్పియర్ మెసేజెస్ అనే ఆప్చన్ తీసుకువచ్చింది.
గతంలో ఈ ఆప్చన్ ప్రకారం 7 రోజులకు సంబంధించిన మెసేజ్లు డిలేట్ చేసుకునే అవకాశం ఉండింది.
90 రోజులు, 24 గంటల టైంను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడు రోజులేకాకుండా ఒక రోజు లేదా 90 రోజుల మెసేజ్లను డిలేట్ చేసుకోవచ్చు.
3.ప్రైవసీ ఆప్చన్లలో డిసప్పియర్ మెసేజెస్ అనే ఆప్చన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
4.డీఫాల్ట్ మెసేజ్ టైమర్ ఓపెన్ అవుతుంది. 24 గంటల నుంచి 90 రోజుల వరకు మీకు అవసరమైన టైంను సెట్ చేసుకోండి.
5.ఒకదానిపై క్లిక్ చేసిన వెంటనే.. ఆప్చన్ ఎనేబుల్ అవుతుంది. మీరు ఎంచుకున్న టైం ప్రకారం మెసేజ్లు డిలేట్ అవుతూ వస్తాయి. మరి, వాట్సాప్ తాజాగా అందుబాటులోకి తెచ్చిన 24గంటలు, 90 రోజుల డిసప్పియర్ మెసేజెస్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.