రిజినల్ ట్రాన్స్పర్ట్ ఆఫీసులో లభించే పలు సేవల్ని ఈ యాప్ ద్వారా పొందొచ్చు. మోక్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో వాహనాల వివరాలను తెలుసుకోవచ్చు.ఆర్టీఓ ఆఫీసుల చిరునామాలు ఉంటాయి.
ఆధార్ సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ యాపను ఆవిష్కరించారు. ఇందులో మీ ఆధార్‌కార్డు డిజిటల్ గా ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడు ఆధార్ కార్డును మీ వెంటపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉండదు.
డిజిటల్ లావాదేవీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఇది. భీమ్ యూపీఐ ద్వారా వినియోగదారులు ఫోన్ నంబర్ లేదా క్యూఆర్ ను ఉపయోగించి చెల్లింపులు జరపొచ్చు.
ఈ యాప్ ద్వారా పాస్పోర్ట్ కు సంబంధించిన సేవల్ని పొందొచ్చు. అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడం.. సమీప పాస్పోర్టు కేంద్రాలను తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఈ యాప్ లో మీకు సంబంధించిన కీలక పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపర్చుకోవచ్చు. ఆధార్, కమ్యూనిటీ, ఇన్కమ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ పీజీ, మార్క్ షీట్లు.. ఇలా అన్ని పత్రాలు సేవ్ చేసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు, రాజకీయ పరిణామాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు.
మరియు వ్యాక్సిన్ కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.టికా ధ్రువపత్రం ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ సెంటర్ల జాబితా కూడ ఉంటుంది.
భారత విదేశాంగశాఖ రూపొందించిన యాప్ మదద్. దీని ద్వారా విదేశాల్లోని రాయబార కార్యాలయాల నుంచి దౌత్య సేవలు అందుతాయి. విదేశాల్లోని భారతీయుల సమస్యల పట్ల అభ్యర్ధనలు, ఫిర్యాదులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
జీఎస్టీ అనేది ఇప్పటికీ చాలా మందికి అర్ధం కాని అంశం. అలాంటి వారికి అర్ధమయ్యే విధంగా ఈ యాప్ వివరిస్తుంది.. జీఎస్టీ రేట్ ఫైండర్ యాప్. ఏయే వస్తువులకు ఎంత జీఎస్టీ పడుతుంది.. ట్యాక్స్ ఎలా వేస్తారు ఇలా అన్ని వివరాలుంటాయి.