గూగుల్ సెర్చ్ చేస్తున్నారా ఈ టెక్నిక్స్ ట్రై చైయండి..

వెంటనే అర్ధాలతో  పాటు వ్యతిరేక పదాలు, సమానార్థకాలూ కనిపిస్తాయి.

మీరు ఒక పదానికి అర్థం తెలుసుకోవాలంటే.. గూగుల్ సెర్చ్ లో  డిఫైన్ (define) అని టైప్ చేసి.  మీరు అర్ధాన్ని  తెలుసుకోవాలనుకునే పదాన్ని టైప్ చేయండి. 

ఆయా వైబ్ సైట్లలో ఉండే అంశాలను మాత్రమే శోధించాలంటే ఎలా ??

సెర్చ్ లో , తెలుసుకోవాలని అనుకునే  అంశాన్ని, తర్వాత Site: అని టైప్ చేయాలి. దీని తర్వాత వెబ్ సైట్ పేరును టైప్ చేయాలి. అప్పుడు  ఆ అంశానికి, ఆ వెబ్ సైట్ కు సంబంధించిన విషయాలే ప్రత్యక్షమవుతాయి.

ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు వద్దనుకునేవి కనిపించకుండా ఉండాలంటే మైనస్ గుర్తు (-) ఉపయోగపడుతుంది. ఉదాహరణకు...

 చికెన్ వంటకాలను సెర్చ్ చేస్తున్నారనుకోండి. టమోటాలు లేనివి కావాలనుకోండి. chicken recipes - tomato అని టైప్ చేస్తే టమోటాలు లేని చికెన్ వంటకాలు ప్రత్యక్షమవుతాయి.

గూగుల్ ను కాలిక్యులేటర్‌గానూ వాడుకోవచ్చు.  మామూలు లెక్కల నుంచి కఠినమైన లెక్కల వరకూ చేసుకోవచ్చు ఉదాహరణకు...

60కి వర్గములన్ని కనుక్కోవాలంటే.. root of 60 అని టైప్ చేయగానే కింద కాలిక్యులేటర్ లాంటిది ప్రత్యక్షమై అందులో జవాబు కనిపిస్తుంది. 

కేవలం పీడీఎఫ్ ఫైళ్లు మాత్రమే చూడాలనుకున్నారు. లేదూ డాక్స్ ఫైళ్లు మాత్రమే వెతకాలని అనుకుంటున్నారు. .

ఇలా ఆయా రకాల ఫైళ్లను  శోధించటానికి file type: అని టైప్ చేసి, తర్వాత ఫైల్ రకాన్ని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి 

సెర్చ్ చేయటానికే కాదు.. గూగుల్ ను టైమర్, స్టాప్ వాచ్  గానూ వాడుకోవచ్చు. సెర్చ్ బార్ లో timer టైప్ చేస్తే టైమ్, స్టాప్ వాచ్ ఆప్షన్లు కనిపిస్తాయి.

పెద్ద పెద్ద అంకెల ఉచ్చారణ చాలాసార్లు కష్టంగా అనిపిస్తుంటుంది. వీటిని ఇంగ్లీషులో సులభంగా   తెలుసుకోవాలి అంటే ??

మీరు అనుకున్న అంకెను టైపు చేసి "= ENGLISH"  టైపు చేసి సెర్చ్  చేయండి 

అ అంకెను  ఎలా పలకాలో అక్షరాల్లో చూపిస్తుంది

 ఒకదాని గురించి గానీ మరోదాని గురించి గానీ వెతకాలనుకుంటే  OR ఆపరేటర్ బాగా ఉపయోగపడుతుంది.  ఉదాహరణకు...

ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మంచి గేమ్, గురించి తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి. best games android OR iphone అని టైప్ చేస్తే విడివిడిగా వీటికి సంబంధించిన వెబ్ సైట్లు ప్రత్యక్షమవుతాయి.