మార్కెట్ లో చౌకగా దొరికే జామకాయలు విలువ లేనివని అనుకోకూడదు. జామకాయ చేసే మేలు గురించి తెలిస్తే వాటిని అస్సలు తినకుండా ఉండరు.
ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందుకే జామకాయ సుగర్ వ్యాధికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది.
కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే " పెక్టిన్" జామలొ లభిస్తుంది. కాబట్టి.. బరువు తగ్గాలి అనుకునేవారికి జామకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది.
జామకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి.
దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలకు జామ చెక్ పెడుతుంది.
కడుపు ఉబ్బరం, కడుపులో మంట ఉండేవారు రోజుకో జామకాయ తింటే ఉపశమనం లభిస్తుంది.
ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.
జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ కంటిచూపు సమస్యలు రాకుండా చేస్తుంది
జామకాయ వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది.
జామకాయలో ఉండే కాపర్, మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, జామ సమర్థవంతంగాపనిచేస్తుంది.
జామపండ్లతో తయారు చేసిన జ్యూస్లు అధికంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు
జామకాయలో ఉండే కెరొటినాయిడ్స్, ఐసోఫావో నాయిడ్స్, పాలి ఫినాల్స్ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
బాగా పండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.