మానవ శ‌రీరానికి ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాల‌ను అందించే సిరి ధాన్యాల‌లో  రాగులు చాలా ముఖ్యమైన‌వి.   

మరి రాగులతో వల్ల  కలిగే ఆ ఆరోగ్య  ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగుల్లో అమినోయాసిడ్స్  అనే అమినోఆమ్లం  ఉంటుంది. దీని వల్ల రాగులు ఆకలి తగ్గించి,  శరీరానికి కావాల్సినంత ఆహారమే తీసుకునేలా  చేస్తాయి. 

ఇక ప్రధానంగా రాగులు శరీర  బరువును  నియంత్రణలో ఉంచుతాయి

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు  సహాయపడుతుంది.

రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే  వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. 

రాగుల వల్ల ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి  పెరుగుతుంది.

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్, మేథినోన్  ఉంటుంది. ఇవి కాలేయంలోని అదనపు  కొవ్వు తగ్గిస్తాయి. 

రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే   పోషకాహార లోపం, ప్రమాదకరమైన  వ్యాధులు వంటివి దరి చేరవు

ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర  నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో  లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు.

వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల  బలం, శక్తి చేకూరుతాయి.

బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మీరు  రాగులతో చేసిన ఆహారాన్ని తప్పక  తీసుకోవాలి. 

రాగులు  రక్తపోటు నివారిణిగా కూడా   ఉపయోగపడుతాయి.