గతమంతా పెట్రోల్/డీజిల్ కార్ల గురుంచే విన్నాం. ఇప్పుడిప్పుడే వీటి ధరలను భరించలేక ప్రత్యామ్నాయ రంగాల వైపు ద్రుష్టి సారిస్తూ.. ఎలక్ట్రిక్ కార్ల వైపు దృష్టిపెడుతున్నాం.
ఈ క్రమంలో నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకు వేసి సోలార్ కారుకి రూపకల్పన చేసింది.
సరికొత్తగా డిజైన్ చేసిన ఈ సోలార్ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపైనే దృష్టి పెట్టాయి. నిత్యం సరికొత్త మోడల్స్‌ని మార్కెట్‌లోకి తెస్తూ .. వినియోగదారులను అక్కటుకుంటున్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు లైట్‌ఇయర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో లెక్స్ హోఫ్స్‌లూట్ తెలిపారు.
లైట్ ఇయర్ జీరో కారు స్వహతాగా ఎలక్ట్రిక్ కారు. 60 కిలోవాట్ బ్యాటరీతో పాటు, 174 హార్స్ పవర్ కలిగిన నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఇందులో అమర్చారు.
సింగిల్ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంది కి.మీ వేగాన్ని అందుకోగలదు.
గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్ పవర్‌ను జత చేశారు.
లైట్‌ఇయర్ జీరో బాడీలో రెండు చదరపు మీటర్ల అధునాత సోలార్ ప్యానెళ్లను అమర్చారు.
వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా కనీసం 35 కి.మీ మైలేజీ లభిస్తుంది.
బయటకు వెళితే ఛార్జింగ్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
సోలార్ పవర్ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.