ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీ రెడ్‌ మీ నోట్ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. 

లాంచ్‌ ఈవెంట్‌లో టెక్‌ ప్రియుల్ని అట్రాక్ట్‌ చేస్తూ రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, నోట్ 11టీ ప్రో+.. స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. 

ఈ మోడల్స్ లో మీడియాటెక్ 8100 చిప్‌ అమర్చడంతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 

38,999కు అందుబాటులో ఉన్న OnePlus 10R వంటి ఖరీదైన ఫోన్‌లలోనూ ఇదే టైప్ చిప్‌ని అమర్చారు.  

అయితే రెండు రెడ్‌మి‌ ఫోన్‌ల మధ్య కొంచెం తేడా ఉండనుంది. ఈ రెండు కొత్త 5G స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 

రెడ్‌మీ నోట్ 11టీ ప్రో 5జీ స్పెషిఫికేషన్స్ 

రెండు స్మార్ట్‌ఫోన్‌లు దాదాపు ఒకే రకమైన స్పెషిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. బ్యాటరీ యూనిట్, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా మాత్రమే తేడా ఉంది. 

ప్రో వెర్షన్ అయితే 5,000mAh బ్యాటరీని కలిగి ఉండి.. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 

ప్లస్ మోడల్ 4,400mAh బ్యాటరీని కలిగి ఉండి.. 120W ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు చేస్తుంది. ఈ డివైజ్ 6.6-అంగుళాల FHD+ LTPS డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.  

ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు కలిగి ఉన్నాయి. 11టీ ప్రోలో.. ఎల్సీడీ డిస్‌ప్లే ఉండగా.. 11టీ ప్రో ప్లస్ లో అమోలెడ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. 

ఇక.. కెమెరా విషయానికి వస్తే.. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది. 8-ఎంపీ కెమెరా, 2ఎంపీ సెన్సార్‌తో కలిసి వస్తుంది. 

ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. నీటి స్ప్లాష్‌లను సైతం తట్టుకోగల సామర్థ్యం ఈ మోడల్స్ కు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 

ధర ఎంతంటే?(అంచనా) 

రెడ్‌మీ నోట్ 11టీ ప్రో స్మార్ట్ ఫోన్ CNY 1,799 ప్రారంభ ధరతో వస్తోంది. అంటే.. భారత మార్కెట్లో దాదాపు రూ. 20,930గా ఉండొచ్చు. 

డివైజ్‌పై లాంచింగ్ ఆఫర్ ద్వారా ధర CNY 1,699 (సుమారు రూ. 19,770)కి అందుబాటులో ఉండనుంది.  

మరోవైపు, రెడ్‌మీ నోట్ 11టీ ప్రో+ (8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్) ధర CNY 1,999 (సుమారు రూ. 23,260)గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

ఈ రెండు మోడల్స్ ఈ నెల ఆఖరు వరకు భారత మార్కెట్ లో లాంచ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.