కొరోనా కుదుపు తర్వాత సినీ ఇండస్ట్రీలో, సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు వారానికి రెండుమూడు సినిమాలు మాత్రమే థియేట్రికల్ రిలీజ్ అవుతుండేవి.

ఎప్పుడైతే పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేట్రికల్ రిలీజులు ఓకే అయ్యేసరికి.. వారానికి ఒకటి, రెండు కాదు ఏకంగా 4-5 సినిమాలపైనే రిలీజ్ అవుతున్నాయి. 

అయితే.. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలకు ఓటిటిలు ప్లాట్ ఫామ్స్ గా నిలుస్తున్నాయి. 

ఇక ఈ వారం థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటిటి విడుదలకు ఏకంగా 11 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో తెలుగు నుండి హాలీవుడ్ వరకూ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముందుగా థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు చూద్దాం. 

F3: ఈ వారం థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఏకైక సినిమా ఇది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ కాగా, ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

OTTలో రిలీజ్ కాబోతున్న సినిమాలు: 

1) అశోకవనంలో అర్జున కళ్యాణం ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ క్లాస్ ఎంటర్టైనర్.. థియేట్రికల్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మే 27న ఆహాలో రిలీజ్ కాబోతుంది. 

2) కన్మణి రాంబో ఖతీజా  స్టార్స్ విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇది మే 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. 

3) ఎటాక్  జాన్ అబ్రహం హీరోగా నటించిన ఈ సినిమా.. మే 27న జీ5 లో రిలీజ్ కాబోతుంది. 

4) ఒబీ వ్యాన్‌ కెనోబి  ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది. 

5) తులసీదాస్‌ జూనియర్‌ ఈ సినిమా మే 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. 

6) వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్ ఈ కొరియన్ డ్రామా ఫిలిం మే 23 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. 

7) స్ట్రేంజర్‌ థింగ్స్‌ ఈ వెబ్ సీరీస్ 4వ సీజన్‌ మే 27న నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కానుంది. 

8) నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ  ఈ వెబ్ సీరీస్ మే 27 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. 

9) సేత్తుమాన్ ఈ తమిళ సూపర్ హిట్ మూవీ మే 27న సోనీ లివ్ లో రిలీజ్ కానుంది. 

10) ఫోరెన్సిక్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాలీవుడ్ మూవీ మే 24 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అయ్యింది.