క్లాస్, మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని  మహేష్ గత కొన్నేళ్లుగా తన సినిమాలను          ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు.

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత  పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు    హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట.. 

       టైటిల్, పోస్టర్స్ నుండి ట్రైలర్, సాంగ్స్  అన్నీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసాయి.  ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ ఎనర్జీ చూసాక, 

పోకిరి రోజులను గుర్తుచేశాయని మహేష్  కూడా చెప్పడంతో అంచనాలు పీక్స్ కి  చేరుకున్నాయి. అందులోను మహేష్                      సరసన కీర్తిసురేష్..  

సినిమాకు తమన్ సంగీతం.. ఇలా సర్కారు       వారి పాటకు అన్నీ అదనపు ఆకర్షణగా     నిలిచాయి.‘సర్కారు వారి పాట’ ఎలాంటి  ఫలితం తీసుకొచ్చింది?  రివ్యూలో చూద్దాం. 

కథ:

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన  మహేష్(మహేష్ బాబు).. పెద్దయ్యాక  అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ బిజినెస్  చేస్తుంటాడు.

 తన లైఫ్ లో జరిగిన ఎమోషనల్ మూమెంట్స్  కారణంగా.. తన దగ్గర అప్పు తీసుకున్నవాళ్లు  ఎలాంటివారైనా,  తీసుకున్న అప్పు ఎంతైనా    వడ్డీతో సహా వసూలు చేయకుండా వదలడు. 

ఈ విషయంలో అప్పు వసూల్ చేసే  విషయంలో ఏమాత్రం రాజీపడడు. అయితే..  అలా వడ్డీ వ్యాపారంతో సాగిపోతున్న మహేష్  లైఫ్ లోకి పైచదువుల కోసం 

    అమెరికా వెళ్లిన కళావతి(కీర్తిసురేష్)  పరిచయం అవుతుంది. ఎవరినీ ఈజీగా         నమ్మని మహేష్ తొలి చూపులోనే         కళావతిపై మనసు పారేసుకుని.. 

లాభంలేదని వైజాగ్ లో ఉన్న కళావతి తండ్రి,  ఎంపీ రాజేంద్రనాథ్(సముద్రఖని) వద్దకు  వెళ్తాడు. ఇక్కడ తండ్రి కూడా  మొరాయించేసరికి మహేష్ ఓ సెన్సేషనల్  అనౌన్స్ మెంట్ చేస్తాడు. 

లాభంలేదని వైజాగ్ లో ఉన్న కళావతి తండ్రి,  ఎంపీ రాజేంద్రనాథ్(సముద్రఖని) వద్దకు  వెళ్తాడు. ఇక్కడ తండ్రి కూడా  మొరాయించేసరికి మహేష్ ఓ సెన్సేషనల్  అనౌన్స్ మెంట్ చేస్తాడు. 

మరి ఇంతకీ మహేష్ అప్పు తీరిందా లేదా?  ఎలా వసూల్ చేశాడు? మహేష్ కి, ఎంపీకి  మధ్య వైరం  

ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరిగా  మహేష్ ఏం సందేశం అందించాడు? అనేది  తెరపై చూడాల్సిందే.

మరి ఇంతకీ మహేష్ అప్పు తీరిందా లేదా?  ఎలా వసూల్ చేశాడు? మహేష్ కి, ఎంపీకి  మధ్య వైరం  

బలమైన పాయింట్ అనుకున్నప్పటికి  పరశురామ్ కథకు పూర్తి న్యాయం  చేయలేకపోయాడు. మహేష్ ని ఎలివేట్ చేసే  క్రమంలో కథాకథనాలను మిస్ చేసినట్లు  అర్థమవుతుంది. 

సెకండాఫ్ లో విలన్ రాజేంద్రనాథ్ బ్యాక్   గ్రౌండ్ గురించి మాట్లాడినప్పుడే ఈ కథ ఎలా  ఉండబోతుందో ప్రేక్షకులు గెస్ చేయగలుగుతారు. 

సినిమాలో పరశురామ్ మ్యాజిక్ స్క్రీన్ ప్లేలో  కనిపించదు.. కానీ డైలాగ్స్ లో కనిపిస్తుంది.  అయితే సెకండాఫ్ లో మహేష్ – కీర్తిల 

మధ్య కాంబినేషన్ సీన్స్ అంతంత మాత్రంగానే  ఉంటాయి. కానీ సినిమాలో ఇఎమ్‌ఐల గురించి,  బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న 

ఘోరాలను చూపిన విధానం ఆసక్తికరంగా  ఉంటుంది. అయితే.. మహేష్ అభిమానులకు  కావాల్సిన అన్నీ మాస్, క్లాస్ అంశాలు 

సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.  ఇక మహేష్, కళావతిల డాన్స్  అదిరిపోయింది. 

చివరిమాట:  మహేష్ బాబు వన్ మ్యాన్ షో..  ఫ్యాన్స్ కి పండగే!