జియో,ఎయిర్‌టెల్‌.. ఏ రెండు కంపెనీల మధ్య పోటీ ఎక్కువ అనేకంటే.. పోరు ఎక్కువ అనడం కరెక్ట్ గా సరిపోతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తోంది అని వినబడితే చాలు.. రెండు రోజుల్లోపు మరో కంపనీ నుంచి కొత్త ప్లాన్ వచ్చేసినట్లే.

వీటి అంతలా పోటీ ఉంటుంది. ఏదైతేనేం.. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా టెలికాం కంపెనీలు రోజుకో కొత్త ఆఫర్ తో ముందుకొస్తున్నాయి. సాధారణంగా టెలికాం సంస్థలు మంత్లీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ను 30 రోజులకు బదులు 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంటాయి. 

ఇటీవల టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మొదటిసారిగా 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో బాటలోనే మరో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

(ఎయిర్‌టెల్ రూ.296 రీచార్జ్ ప్లాన్ ) ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 25 జీబీ డేటా పొందవచ్చు. డేటా లిమిట్ దాటితే ఒక ఎంబీ డేటాకి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. 

(ఎయిర్‌టెల్ రూ.296 రీచార్జ్ ప్లాన్ ) అంతేకాదు, నెల రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మొబైల్ ఎడిషన్‌ ఫ్రీ ట్రయల్ పొందవచ్చు. ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ వింక్ యాక్సెస్‌తో పాటు హలో ట్యూన్స్ పొందవచ్చు. 

(ఎయిర్‌టెల్ రూ.310 ప్రీపెయిడ్ ప్లాన్) ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ చొప్పున నెలకు 56 జీబీ లేదా 62 జీబీ డేటా పొందుతారు.  

(ఎయిర్‌టెల్ రూ.310 ప్రీపెయిడ్ ప్లాన్) డేటా లిమిట్ దాటాక స్పీడ్ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అలాగే ఎయిర్‌టెల్ వింక్ యాక్సెస్‌తో పాటు హలో ట్యూన్స్ పొందవచ్చు. 

(జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్) ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటా పొందుతారు. డేటా లిమిట్ దాటాక స్పీడ్ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. 

(జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్) రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అలాగే జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ అదనంగా పొందవచ్చు. 

(జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్) రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అలాగే జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ అదనంగా పొందవచ్చు. 

(గమనిక)  ఈ ప్లాన్ లో రోజులతో సంబంధం లేదు. అంటే,.. ఒక నెలకు 30 రోజులు, మరో నెలకు 31 రోజులు ఉంటాయి. అలా సంబంధం లేకుండా ప్రతినెలా ఒకే రోజు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మార్చి నెల 28న రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ ఏప్రిల్ 28న తిరిగి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ముందే మీరు రీఛార్జ్ చేసుకుంటే పాత ప్లాన్ గడువు ముగియగానే ఆటోమేటిక్ గా కొత్త రీఛార్జ్ యాక్టివేట్ అవుతుంది. 

(ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్) ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. “ప్రతి టెలికాం సంస్థ 30 రోజుల వాలిడిటీతో కనీసం ఒక రీచార్జ్ ప్లాన్‌ అయినా అందించాలి.  

(ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్) తిరిగి ఆ రీచార్జ్ గడువు ముగిసే రోజు మళ్లీ అదే ప్లాన్‌తో రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉండాలి” అని ఆదేశాలిచ్చింది.  

(ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్) ఈ ఆదేశాలతో రిలయన్స్ జియో (రూ.259)తో 30 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

(ట్రాయ్ తాజా ఆదేశాలతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్) తాజాగా అదే బాటలో ఎయిర్‌టెల్ కూడా 30 రోజుల వాలిడిటీ ప్లాన్స్‌(రూ.296, రూ.310)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.