elections

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన కేసీఆర్‌

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కాసేప‌టి క్రితం ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు కోనాయిప‌ల్లి ప్ర‌ముఖ దేవ‌స్థానం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీశ్‌రావు కూడా స్ఆమివారిని ద‌ర్శించుకున్నారు.

భారీ బందోబ‌స్తు మ‌ధ్య తొలిద‌శ పోలింగ్‌..!


భారీ బందోబ‌స్తు మ‌ధ్య తొలిద‌శ పోలింగ్‌..!

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ చురుగ్గా కొన‌సాగుతుంది.  మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో కూడా ఉద‌యం ఉంచే పోలింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని మావోయిస్టులు పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ ఓట్లు వేసేందుకు జ‌నం ఆస‌క్తిని చూపిస్తున్నారు. తొలి ద‌శ‌లో 18 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 

కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

కారులో ఎవ‌రు తిరిగినా.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే..!

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో గెలుపు ఎంఐఎందేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ. నాలుగేళ్లు ఏమీ చేయ‌నివారు కారు వేసుకుని వ‌స్తున్నార‌ని, దాని స్టీరింగ్ మాత్రం త‌మ చేతుల్లోనే ఉంద‌ని ప‌రోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చ‌రించారు. ఎంఐఎం ముక్త్ హైద‌రాబాద్ కాదు..  తెలంగాణ ముక్త్ బీజేపీ కావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ 

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు


యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతీ నాయకుడు అంటాడు, కానీ నిజానికి రానిస్తారా? రానివ్వరు. ఇప్పుడున్న నాయకుల్లో ఆ లోకేష్, జగన్ లాంటి సౌండ్ పార్టీలకి తప్ప సామాన్య యువతకి రాజకీయాల్లో చోటు లేదు. డబ్బుందా? వచ్చి స్యూట్ కేసు ఇచ్చి టికెట్ తీసుకెళ్లు, ఎలక్షన్స్ అయ్యాక ఎంత కావాలంటే అంత దోచుకెళ్లు. ఇదీ ఇవాల్టి రాజకీయాలు. రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ముందు కోట్లు ఖర్చుపెట్టాలి, ఆ తర్వాత ఖర్చుపెట్టినవన్నీ దక్కించుకోవాలి. ఈ ఫార్మాట్ లోనే నడుస్తున్నాయి రాజకీయాలు. 

కోదండ‌రామ్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు ఇదే..!

కోదండ‌రామ్ పార్టీ గుర్తు ఇదే..!


మ‌హాకూట‌మిలో తమ పార్టీ టీజేఎష్ కూడా భాగ‌స్వామ్యం అయినందున త‌మ‌కు క‌చ్చితంగా ప‌ది సీట్లు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు ఆ పార్టీ అధినేత కోదండ‌రామ్ తెలిపారు. కాగా, ఇవాళ టీజేఎస్ అధినేత కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ త‌మ పార్టీ గుర్తు అగ్గె పెట్టె అని చెప్పారు. గుర్తుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియా ముందు ఉంచారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవ‌ల కాలంలో త‌మ పార్టీ నేత‌లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను రెండు సార్లు క‌లిశామ‌న్నారు.

ఎన్నిక‌ల్లో పోలింగ్‌శాతం పెంచేందుకు స‌రికొత్త యాప్స్‌..!


ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల బృందం మూడు రోజుల‌పాటు తెలంగాణ‌లో విస్తృతంగా ప‌ర్య‌టించింది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌కీయ పార్టీల నుంచి ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డంతోపాటు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టిని సారించింది. అయితే, నేటితో ప‌ర్య‌ట‌న ముగిసిన సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

ఏపీలో మూడు నెల‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు

ఏపీలో మూడు నెల‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని హైకోర్టు ఆదేశించింది.  మూడు నెల‌ల్లో ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరింది. హైకోర్టు తీర్పుతో ప్ర‌త్యేక అధికారుల పాల‌న కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్ల‌యింది. అయితే, ఆగ‌స్టు 1వ తేదీన పంచాయ‌తీల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మిస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జీవో నెం.90ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.