minister

అలాంటి వాళ్లు ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డుపుతారు..? : కేటీఆర్‌

అలాంటి వాళ్లు ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డుపుతారు..? : కేటీఆర్‌

గాంధీ భ‌వ‌న్ తలుపులు ప‌గ‌ల‌గొడ‌తార‌నే భ‌యంతో అర్థ‌రాత్రి పూట కాంగ్రెస్ పార్టీ త‌మ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింద‌ని విమ‌ర్శించారు మంత్రి కేటీఆర్‌. గాంధీ భ‌వ‌న్‌ను చూస్తే.. గాంధీ ఆస్ప‌త్రిలా క‌నిపిస్తుందంటూ కాంగ్రెస్ నేత‌ల‌పై సెటైర్లు వేశారు. దివ్యాంగుల పింఛ‌న్ ల‌బ్ధిదారుల కృత‌జ్ఞ‌త స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికారంఒలోకి వ‌స్తే రాష్ట్ర వ‌న‌రులు తెలంగాణ‌కే ద‌క్కుతాయ‌ని అన్నారు కేటీఆర్‌.

Tags

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు


యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతీ నాయకుడు అంటాడు, కానీ నిజానికి రానిస్తారా? రానివ్వరు. ఇప్పుడున్న నాయకుల్లో ఆ లోకేష్, జగన్ లాంటి సౌండ్ పార్టీలకి తప్ప సామాన్య యువతకి రాజకీయాల్లో చోటు లేదు. డబ్బుందా? వచ్చి స్యూట్ కేసు ఇచ్చి టికెట్ తీసుకెళ్లు, ఎలక్షన్స్ అయ్యాక ఎంత కావాలంటే అంత దోచుకెళ్లు. ఇదీ ఇవాల్టి రాజకీయాలు. రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ముందు కోట్లు ఖర్చుపెట్టాలి, ఆ తర్వాత ఖర్చుపెట్టినవన్నీ దక్కించుకోవాలి. ఈ ఫార్మాట్ లోనే నడుస్తున్నాయి రాజకీయాలు. 

ములుగులో టీఆర్ఎస్ వ‌ర్గ‌పోరు వెలుగులోకి..!

ములుగులో టీఆర్ఎస్ వ‌ర్గ‌పోరు వెలుగులోకి..!

జ‌య‌శంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో టీఆర్ఎస్ వ‌ర్గ‌పోరు ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని టీఆర్ఎస్ అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన నాయ‌కుల వాహ‌నాల‌ను మంత్రి చందూలాల్ కుమారుడు ప్ర‌హ్లాద్ అనుచ‌రులు ధ్వంసం చేశారు. అయితే, దానిని నిర‌సిస్తూ, ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన చందూలాల్‌ను అడ్డుకునేందుకు అస‌మ్మ‌తి నేత‌లు, ఆదివాసీలు ప్ర‌య‌త్నించ‌డం ఉద్రిక్త‌త‌కు తెర‌లేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగ‌పేట మండ‌లంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. సీఆర్పీఎఫ్‌తోపాటు, స్పెష‌ల్ సివిల్ పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

అమ్మను తిట్టిన బొత్సను సిగ్గు లేకుండా వైసీపీలో చేర్చుకున్న జ‌గ‌న్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై మంత్రి సుజ‌య కృష్ణ రంగారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్‌లో ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ను అన‌రాని మాట‌లు అన్నార‌ని, అటువంటిది, అలా తిట్టిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌నే ఇప్పుడు మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ చిరు న‌వ్వుతో పార్టీలోకి ఆహ్వానించార‌ని, సిగ్గులేని రాజ‌కీయాలు చేయ‌డం ఒక్క జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌వుతాయ‌ని అన్నారు మంత్రి సుజ‌య కృష్ణ రంగారావు,