andhrapradesh

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు స్పీడ్ పెంచిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతి స్టెప్ వేయ‌బోతున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను క‌లుపుకుని భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మ త‌మ రాష్ట్రాల్లో జాతీయ  స్థాయి నేత‌ల‌తో స‌భ‌లు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే నాటికి వీలైన‌న్ని పార్టీల‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.  

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!


ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాను అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ పార్టీని కాంగ్రెస్‌తో పొత్తు కుద‌ర్చుకోవ‌డం దారుణ‌మ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది ఒక్క‌సారికూడా లేద‌న్నారు. 2004 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఆత‌రువాత మాట మార్చి బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రాత్మ‌క త‌ప్పిదం చేశామంటూ మాట్లాడార‌న్నారు. 

వేధింపుల‌కు బ‌లి..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కధ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడి వెనుక రాజకీయకోణం దాగి ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో నిందితుడు శ్రీనివాస్ స్పందించాడు. ప్రజా సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే దాడి చేశా అన్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా ఐతే దేవుడు అనుకుంటున్నారో, అలానే జగన్ ను కూడా దేవుడిగా భావించాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు ప్రాణహాని ఉందని వెల్లడించాడు. తనను కాపాడవల్సిందిగా మీడియాను కోరాడు.

జ‌గ‌న్‌పై దాడి కేసులో హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా..?


జ‌గ‌న్‌పై దాడి విష‌యంలో వైసీపీ నేత‌లు అన్ని అస్త్రాల‌ను సంధిస్తున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్‌పై దాడి విష‌యాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు హ‌స్తిన‌బాట ప‌ట్టిన ఆ పార్టీ నేత‌లు థార్డ్ పార్టీతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు వైసీపీ నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.  దీనిపై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు త‌దుప‌రి  విచార‌ణ బుధ‌వారానికి వాయిదా వేసింది. 

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌


ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. వైఎస్ జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న వైసీపీ డ్రామానే అని నారా లోకేష్ అన్నారు.  కోడి క‌త్తి వెనుకున్న నిజం మాత్రం మారదు అన్నారు. వైసీపీ ఆడిన ఈ డ్రామాలో వైఎస్ జ‌గ‌న్ అడ్డంగా దొరికిపోయార‌ని నారా లోకేష్ అన్నారు. అంతేకాకుండా,  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని.. జ‌గ‌న్ మోడీ రెడ్డిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. కుట్ర‌ను బ‌య‌ట‌పెడితే అంతు చూస్తామ‌ని అంటూ పోలీసులను బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు మంత్రి లోకేష్‌. 

సీఎం చంద్ర‌బాబుకు ఎమ్మెల్యే రోజా ఓపెన్ ఛాలెంజ్‌

వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన అనంత‌రం నేరుగా విశాఖ ఆస్ప‌త్రికి కాకుండా నేరుగా హైద‌రాబాద్ లోట‌స్ పాండ్లోని త‌న ఇంటికి వెళ్లి ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి వెళ్లార‌ని చంద్ర‌బాబు నిరూపించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిని వైసీపీ రాజ‌కీయం చేయ‌డం లేద‌ని.. చంద్ర‌బాబు అండ్ కో బ్యాచ్ రాజ‌కీయం చేస్తుంద‌న్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తికి గుండెపోటు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్, టీడీపీ ఎమ్మెల్సీ కావ‌లి ప్ర‌తిభా భార‌తి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కాగా, ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తి తండ్రి జ‌స్టిస్ పున్న‌య్య (92) అనారోగ్యంతో విశాఖ న‌గ‌రంలోని పినాకిని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ప్ర‌తిభా భార‌తికి ఒక్క‌సారిగా గుండెపోటు వ‌చ్చింది.

బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం జ‌గ‌న్‌పై దాడి  :సీఎం చంద్ర‌బాబు

బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం జ‌గ‌న్‌పై దాడి  :సీఎం చంద్ర‌బాబు

ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ త‌న‌మీద ఉన్న కేసుల్లో భాగంగా సీబీఐ కోర్టుకు ప్ర‌తీ శుక్ర‌వారం వెళ్ల‌కుండా, వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు తెచ్చుకునేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని, అందులో భాగంగానే ప్లాన్ ప్ర‌కారం దాడి జ‌రిగేలా జ‌గ‌న్ స్కెచ్ వేశార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు.