kodanda ram

మ‌హాకూట‌మిపై కోదండ‌రామ్ ఫైర్‌..!

తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్ర‌స్తుతం ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే, మ‌హాకూట‌మిలోని పార్టీల నేత‌లంద‌రూ తాము ఆశిస్తున్న సీట్ల జాబితాను మ‌హాకూట‌మి ముందు ఉంచారు. అయితే, మ‌హాకూట‌మి ఏర్పాటు వ‌ర‌కు ముంద‌డుగు వేసిన ప్ర‌తిప‌క్ష పార్టీలు సీట్ల పంప‌కం విష‌యంలో మాత్రం వెన‌క‌డుగు వేస్తున్నాయి. తాము అనుకున్న సీట్లు కేటాయించేందుకు విముఖ‌త చూప‌డంతో ప‌లు పార్టీల నేత‌లు సైతం ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

మ‌హాకూట‌మిలో సీట్ల పంచాయితీ..!

మ‌హాకూట‌మిలో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయా..?  సీట్ల పంచాయితీతో మొద‌టికే మోసం వ‌చ్చిందా..?  కాంగ్రెస్ పెడుతున్న ష‌ర‌తులు మిగ‌తా పార్టీల‌కే  న‌చ్చ‌డం లేదా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు మ‌హాకూట‌మి పార్టీల నేత‌లు.