high court

ఈ నెల 12న ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయొచ్చు :హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ‌తో పాటు శ‌శాంక్‌రెడ్డి వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పును రిజ‌ర్వులో పెట్టింది. ఈ నెల 12న ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేయొచ్చ‌ని సూచించింది. ఓట‌ర్ల జాబితాపై అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఓట‌ర్ల జాబితా పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 12కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఓటర్లలిస్టు అవకతవకలపై నేడు హైకోర్టులో విచారణ

తెలంగాణలోని ఓటర్ల జాబితాలోని అవకతవకలపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై గతంలో వేసిన రెండు పిటిషన్లతోపాటు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, వీటిలో 93 లక్షలకు పైగా ఓటర్లలో అవకతవకలు ఉన్నాయన్న రెండు పిటిషన్లను బెంచ్ కొట్టేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయన్న కాంగ్రెస్ నేతల పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఓటర్ల జాబితా విడుదలకు ముందే పిటిషనర్లకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఈసీని ఆదేవించింది హైకోర్టు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది.