top director

సినిమాలు లేకపోవడంతో గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నటాప్ డైరెక్టర్ | Top Director Turns Beggar

        సినిమాలు లేకపోవడంతో గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నటాప్ డైరెక్టర్ 

          తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖరన్ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సెంథిల్ నాథన్.. ఆ తరువాత విజయకాంత్ నటించిన ‘పూందోట్ట కావల్క్కాన్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఎంజీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జంబులింగం గారి తనయుడే సెంథిల్ నాథన్. తమిళ సినీ పరిశ్రమతో వీరి కుటుంబానిది కొన్ని తరాల నుండి కొనసాగుతున్న అనుబంధం.