india

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు

కాబోయే ముఖ్యమంత్రి ఆస్తి కేవలం 1200/- రూపాయలు


యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతీ నాయకుడు అంటాడు, కానీ నిజానికి రానిస్తారా? రానివ్వరు. ఇప్పుడున్న నాయకుల్లో ఆ లోకేష్, జగన్ లాంటి సౌండ్ పార్టీలకి తప్ప సామాన్య యువతకి రాజకీయాల్లో చోటు లేదు. డబ్బుందా? వచ్చి స్యూట్ కేసు ఇచ్చి టికెట్ తీసుకెళ్లు, ఎలక్షన్స్ అయ్యాక ఎంత కావాలంటే అంత దోచుకెళ్లు. ఇదీ ఇవాల్టి రాజకీయాలు. రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ముందు కోట్లు ఖర్చుపెట్టాలి, ఆ తర్వాత ఖర్చుపెట్టినవన్నీ దక్కించుకోవాలి. ఈ ఫార్మాట్ లోనే నడుస్తున్నాయి రాజకీయాలు. 

టీమిండియా ఘ‌న విజ‌యం

టీమిండియా ఘ‌న విజ‌యం


మూడో వ‌న్డేలో ఓట‌మితో దెబ్బ తిన్న టీమిండియా ముంబైలో రెచ్చిపోయింది. విండీస్‌ను 224 ప‌రుగుల భారీ తేడాతో ఓడించి క‌సి తీర్చుకుంది. ఓపెన‌ర్ రోహిత్‌శ‌ర్మ వీర విహారం, తెలుగు కుర్రాళ్లు అంబ‌టి రాయుడు ప్రామిసింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడు బౌల‌ర్ల దూకుడు కూడా తోడ‌వ‌డంతో టీమిండియా సునాయాస విజ‌యం సాధించింది.  

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు..!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు..!


సీబీఐలో డైరెక్ట‌ర్స్‌, స్పెష‌ల్ డైరెక్ట‌ర్స్ మ‌ధ్య గొడ‌వ కాస్తా.. కోర్టుమెట్లెక్కింది. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఆస్థానా త‌న‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ కొట్టేయాల‌ని, త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా నిలువ‌రించాల‌ని కోరారు. మ‌రో వైపు.. ఓ ఖాళీ కాగితంపై త‌న సంత‌కం తీసుకున్నార‌ని సీబీఐ అరెస్టు చేసిన వ్య‌క్తి దేవేంద్ర కుమార్ ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.  అయితే, సీబీఐ మాత్రం దేవేంద్ర కుమార్‌ను ప‌ది రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరింది.  దేవేంద‌ర్‌కు వ్య‌తిరేకంగా ఆధారాలు ఉన్నాయ‌ని వాదిస్తోంది సీబీఐ. 

ఓట‌మితో పాఠం నేర్చిన విండీస్‌

మొద‌టి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల‌లో విండీస్ తీరును చూసిన వారంద‌రూ ఉప్ప‌ల్‌లో ఏ మాత్రం సానుకూలంగా మ్యాచ్‌ను కొన‌సాగిస్తుంద‌ని ఊహించ‌లేదు. ప‌ట్టుద‌ల‌తో ఆడిన ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ భార‌త బౌల‌ర్ల‌కు గ‌ట్టి స‌వాల్‌ను విసిరారు. మొద‌టి రోజు విండీస్ ఏడు వికెట్ల న‌ష్టానికి 295 ప‌రుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్‌కు స‌రైన ఆరంభం ద‌క్క‌లేదు. జ‌ట్టు స్కోరు 32 ప‌రుగుల వ‌ద్ద కీర‌న్ పావెల్ కుల్దీప్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ బ్రాత్‌వైట్ కూడా ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. త‌రువాత హోప్ కూడా లంచ్‌కు ముందు పెవిలియ‌న్‌కు చేరాడు.