politics

ప్ర‌లోభాల ప‌ర్వంలో నేత‌లు..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంతో ఇవాళతో క‌లిపి  మూడు రోజులే ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తెర వెనుక త‌మ ప్ర‌య‌త్నాల‌ను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. త‌మ‌తోపాటు ప్ర‌చారంలో పాల్గొంటున్న వారిని మంచిగా చూసుకోవ‌డంతోపాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వ‌ల వేస్తున్నారు. స్థాయినిబ‌ట్టి బ‌హుమ‌తులిచ్చి మంచి చేసుకుంటున్నారు. 

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు స్పీడ్ పెంచిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతి స్టెప్ వేయ‌బోతున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను క‌లుపుకుని భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మ త‌మ రాష్ట్రాల్లో జాతీయ  స్థాయి నేత‌ల‌తో స‌భ‌లు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే నాటికి వీలైన‌న్ని పార్టీల‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.  

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం...!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం...!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైకిల్ పార్టీకి  ప్రచారం చేయబోతున్నాడా? ఒకవేళ చేస్తే మరి ఎన్టీయార్, సంగతేంటి? ఇందులో నిజం ఎంతవరకు ఉంది...? సాధారణంగా ఎన్నికల వేళ తమ పార్టీ మానిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, హామీల వర్షం కురిపిస్తుంటారు...పార్టీ నాయకులు...కానీ, ఎంత చెప్పినా ఎటు తిరిగిన అదే నాయకులు అదే ఊకదంపుడు ప్రసంగాలు...ఇలా రొటీన్ గా కాకుండా, గత కొద్ది కాలంగా పార్టీలకు సెలబ్రిటీల ప్రచారం చేయడం, జోరుగా సాగుతోంది...

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!

కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం దారుణం..!


ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాను అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ పార్టీని కాంగ్రెస్‌తో పొత్తు కుద‌ర్చుకోవ‌డం దారుణ‌మ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది ఒక్క‌సారికూడా లేద‌న్నారు. 2004 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఆత‌రువాత మాట మార్చి బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రాత్మ‌క త‌ప్పిదం చేశామంటూ మాట్లాడార‌న్నారు. 

వేధింపుల‌కు బ‌లి..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కధ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడి వెనుక రాజకీయకోణం దాగి ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో నిందితుడు శ్రీనివాస్ స్పందించాడు. ప్రజా సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే దాడి చేశా అన్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా ఐతే దేవుడు అనుకుంటున్నారో, అలానే జగన్ ను కూడా దేవుడిగా భావించాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు ప్రాణహాని ఉందని వెల్లడించాడు. తనను కాపాడవల్సిందిగా మీడియాను కోరాడు.

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌


ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. వైఎస్ జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న వైసీపీ డ్రామానే అని నారా లోకేష్ అన్నారు.  కోడి క‌త్తి వెనుకున్న నిజం మాత్రం మారదు అన్నారు. వైసీపీ ఆడిన ఈ డ్రామాలో వైఎస్ జ‌గ‌న్ అడ్డంగా దొరికిపోయార‌ని నారా లోకేష్ అన్నారు. అంతేకాకుండా,  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని.. జ‌గ‌న్ మోడీ రెడ్డిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. కుట్ర‌ను బ‌య‌ట‌పెడితే అంతు చూస్తామ‌ని అంటూ పోలీసులను బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు మంత్రి లోకేష్‌. 

బాధిత కుటుంబాల‌కు మాజీ ఎమ్మెల్యే రసమయి ప‌రామ‌ర్శ‌

గన్నేరువరం అక్టోబర్ 26 ప్రభన్యూస్: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వెదిర కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి యొక్క కుటుంబాన్ని మరియు స్థానిక గ్రామపంచాయితీ పారిశుద్య కార్మికుడు వడ్లూరి ఎల్లయ్య ఇటీవల మృతి చెందిన విష‌యం తెలిసిందే.

సీఎం చంద్ర‌బాబుకు ఎమ్మెల్యే రోజా ఓపెన్ ఛాలెంజ్‌

వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన అనంత‌రం నేరుగా విశాఖ ఆస్ప‌త్రికి కాకుండా నేరుగా హైద‌రాబాద్ లోట‌స్ పాండ్లోని త‌న ఇంటికి వెళ్లి ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి వెళ్లార‌ని చంద్ర‌బాబు నిరూపించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిని వైసీపీ రాజ‌కీయం చేయ‌డం లేద‌ని.. చంద్ర‌బాబు అండ్ కో బ్యాచ్ రాజ‌కీయం చేస్తుంద‌న్నారు.