chandrababu

   సీబీఐకి నో ఎంట్రీ బోర్డు 

         సీబీఐకి నో ఎంట్రీ బోర్డు 

          సీబీఐ కి ఆంధ్రప్రదేశ్‌  సర్కార్ నో ఎంట్రీ బోర్డు పెట్టడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ap లో సీబీఐ అడుగుపెట్టాలి అంటే ముందు అనుమతి తీసుకోవాలి అంటూ ప్రభుతం జారీచేసిన ఉత్తర్వులు హార్ట్ టాపిక్ గా మారాయి . ఆంధ్ర ప్రదేశ్ లో సీబీఐ దర్యాప్తు  చేయడానికి  ప్రభుత్వం ఇచ్చే జనరల్ కాన్సెన్ట్ ను ఉపసంహరిస్తూ జియో  no 176 ను తిస్కచారు.

జ‌గ‌న్‌పై దాడి కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు..!

జ‌గ‌న్‌పై దాడి కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి కోడిక‌త్తితో దాడి చేసిన కేసు ఇవాళ హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. కేసు విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు న్యాయ‌మూర్తి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ స‌హా మొత్తం ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆ నోటీసుల్లో హైకోర్టు పేర్కొంది.

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుపై చంద్ర‌బాబు దూకుడు..!

జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర కూట‌మి ఏర్పాటుకు స్పీడ్ పెంచిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర్వాతి స్టెప్ వేయ‌బోతున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను క‌లుపుకుని భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మ త‌మ రాష్ట్రాల్లో జాతీయ  స్థాయి నేత‌ల‌తో స‌భ‌లు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే నాటికి వీలైన‌న్ని పార్టీల‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు చంద్ర‌బాబు.  

బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు   కాసేప‌టి క్రితం బెంగ‌ళూరుకు చేరుకున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో దేవెగౌడ‌, కుమార‌స్వామితో భేటీ కానున్నారు. ప‌ద్మ‌నాభ న‌గ‌ర్ంలోని దేవెగౌడ నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల వ‌రుస భేటీల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏం చేశావ‌ని టీడీపీని వాడుకుంటున్నావు


జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు వైసీపీ నేత లక్ష్మీ పార్వ‌తి. అందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర ఆమె నిర‌స‌న‌కు దిగారు. ఎన్టీఆర్ ఢిల్లీలో ఎవ‌రి ముందు కూడా  సాగిల‌ప‌డ‌కుండా ఉంటే చంద్ర‌బాబు మాత్రం తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టుపెట్టార‌ని విమ‌ర్శించిన ల‌క్ష్మీపార్వ‌తి న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. 

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కధ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడి వెనుక రాజకీయకోణం దాగి ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో నిందితుడు శ్రీనివాస్ స్పందించాడు. ప్రజా సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే దాడి చేశా అన్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా ఐతే దేవుడు అనుకుంటున్నారో, అలానే జగన్ ను కూడా దేవుడిగా భావించాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు ప్రాణహాని ఉందని వెల్లడించాడు. తనను కాపాడవల్సిందిగా మీడియాను కోరాడు.

 అప్పుడు ఎన్టీఆర్ పై, ఇప్పుడు జగన్ పై....బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

         అప్పుడు ఎన్టీఆర్ పై, ఇప్పుడు జగన్ పై....బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

                      విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

హ‌స్తిన చేరిన క‌త్తి రాజ‌కీయం..!

హ‌స్తిన చేరిన క‌త్తి రాజ‌కీయం..!

రాష్ట్రాన్ని అస్థిర‌ప‌రిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జ‌గ‌న్  తో క‌లిసి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్‌పై దాడిని అడ్డుపెట్టుకుని అల్ల‌ర్లు సృష్టించి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని వైసీపీ ప్ర‌యత్నిస్తుందని చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు.