Kcr

తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌రో అరుదైన దృశ్యం..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేడు మ‌రో అరుదైన దృశ్యం క‌నిపించ‌బోతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు నేడు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలో పాల్గొన‌నున్నారు. రాహుల్ గాంధీ ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల ప్ర‌చారంలో పాల్గొన‌గా మోడీ రెండు స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఈ ఇద్ద‌రు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేందుకు చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

ఎవ‌రేం చేశారో ప్ర‌జ‌ల‌కు తెలుసు :   కేసీఆర్‌

స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ అన్ని విధాలుగా న‌ష్టపోయింద‌ని, నాడు పాల‌న చేసిన కాంగ్రెస్‌, టీడీపీ ప్ర‌భుత్వాలు దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయ‌ని, దీంతో ప్ర‌జ‌ల అభివృద్ధి కుంటు ప‌డింద‌ని తెరాస అధినేత‌, ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ అన్నారు. కాగా ,ఇవాళ ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ ప్ర‌పంచ‌లో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా రాజ‌కీయ ల‌బ్ధి కోసం తెరాస‌పై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

Tags

ఓట్ల కోసం ఎంత‌కైనా దిగ‌జారుతారా..?

ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ఎంతకైనా దిగ‌జారుతారా..? మేమేన్నా గొర్రెల‌మా..? అంటూ తెలంగాణ ప్ర‌తిప‌క్షాల‌పై ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి, తెరాస అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఫైర‌య్యారు. కాగా, ఇవాళ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో నిర్వ‌హించిన తెరాస ఆశీర్వాద బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన మ‌హాకూట‌మి, బీజేపీ, పార్టీల నేత‌ల‌పై కేసీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ, బీజేపీ అధ్య‌క్షులు అమిత్ షా తెలంగాణ‌లో క‌రెంటు లేదంటారా..?

Tags

ఇంట్లో కూర్చునే సీఎం  మాకొద్దు 

           ఇంట్లో కూర్చునే సీఎం  మాకొద్దు 

     రెండున్నర ఏళ్ళు సెక్రెటరీ మొఖం చూడని సీఎం కేసీఆర్‌ ప్రజల కష్ఠాలు ఏమి తెలుస్తాయి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన కేసీఆర్‌

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కాసేప‌టి క్రితం ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్‌ను దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు కోనాయిప‌ల్లి ప్ర‌ముఖ దేవ‌స్థానం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీశ్‌రావు కూడా స్ఆమివారిని ద‌ర్శించుకున్నారు.

ఈ స‌మ‌యంలో నామినేష‌న్ వేస్తే కేసీఆర్‌కు రాజ‌యోగం..!

ఈ స‌మ‌యంలో నామినేష‌న్ వేస్తే కేసీఆర్‌కు రాజ‌యోగం..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ‌జ్వేల్‌లో నామినేష‌న్ వేయ‌బోతున్నారు. కాసేప‌ట్ల్లో ఎర్ర‌వెళ్లి నుంచి  కోనాయిప‌ల్లికి వెళ్లి అక్క‌డ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసి నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వెళ్తారు. మ‌ధ్యాహ్నం 2.34 గంట‌ల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. ఈ ముహూర్తంలో కేసీఆర్ నామినేష‌న్ వేస్తే కేసీఆర్‌కు మ‌రోసారి రాజ‌యోగం వ‌స్తుంద‌ని పండితులు సూచించారు. 

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. TRSలోకి మెగాస్టార్ చిరంజీవి..!

TRS కండువా కప్పుకోనున్న చిరంజీవి..!

స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. 2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి తన సేవలను కొనసాగించారు. ఐతే, 2014 ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలని విడదీసిన కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రా ప్రజలంతా తమ కడుపు మంటను వెలగక్కారు. దీంతో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. కానీ చిరు మాత్రం ఆ పార్టీని వదిలిపెట్టలేదు.

టీఆర్ఎస్ @ ల‌క్ష వీడియోలు

టీఆర్ఎస్ @ ల‌క్ష వీడియోలు

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా కొన‌సాగుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి నాయ‌కుల నిర్ణ‌యాల‌తో రాజ‌కీయ ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోతున్నాయి. పార్టీల నేత‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తూ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. అంతేకాకుండా, నేత‌లు వారి కుటుంబాన్ని సైతం ప్ర‌చార ప‌ర్వంలో పాల్గొనేలా చూస్తున్నారు. ఇలా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ ఓట్లు రాబ‌ట్టుకునే ప‌నిలో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. 

Tags