news

వేధింపుల‌కు బ‌లి..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.

12 టన్నుల నిషేధిత క్యాట్ ఫిష్ పట్టివేత

12 టన్నుల నిషేధిత క్యాట్ ఫిష్ పట్టివేత

 ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం(ఒంగోలు) జిల్లా ఓబిలిశెట్టి పాలెం నుండి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోకు రెండు లారీల్లో సరఫరా అవుతున్న 12 టన్నుల నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం నాడు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్సు ఏసిపి శోభన్ కుమార్ వివరాలను వెల్లడించారు. ప్రకాశం (ఒంగోలు) జిల్లా ఓబిలిశెట్టి పాలెం నుండి వయా మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్లోని లక్నో కు రెండు లారీలు అక్రమంగా సరఫరా చేస్తున్న నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొత్తపల్లి బైపాస్ రోడ్డు మార్గంలో వెళుతుండగా పట్టుకున్నారు.

Tags

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

 

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఒక్క‌టైన ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జ‌న స‌మితి ఇలా ప‌లు పార్టీలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను దాదాపు 105 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేసిన కేసీఆర్ ప్ర‌చార శంఖారావాన్ని కూడా ప్రారంభించారు. మ‌రో ప‌క్క మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల లిస్టు మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు.

Tags

జ‌న‌సేనుని మ‌హా క‌వాతు

జ‌న‌సేనుని మ‌హా క‌వాతు

గోదావ‌రి సాక్షిగా చారిత్రాత్మ‌క ఘ‌ట్టం ఆవిష్కృతి కాబోతుంది. వివిధ వ‌ర్గాలు, యువ‌త‌, మ‌హిళల విశేష ఆద‌ర‌ణ‌తో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన పోరాట యాత్ర కొన‌సాగించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి జిల్లాలో పోరాట యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాలు, హామీలు, మేనిఫెస్టోలోని అంశాలు నెర‌వేర్చ‌లేద‌ని నిర‌సిస్తూ రాజ‌కీయ జ‌వాబుదారిత‌నంపై యువ‌త‌ను జాగృతం చేయ‌డానికి గోదావ‌రి సాక్షిగా క‌వాతుకు శ్రీ‌కారం చుట్టారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

విజ‌య‌శాంతికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హించే తేదీని ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. దీంతో పార్టీల నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను, అలాగే, ప్ర‌త్య‌ర్ధుల‌పై సంధించాల్సిన అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని ప్రారంభించ‌గా.. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డ టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డించాల్సి ఉంది. ఇంకా అభ్య‌ర్థుల పేర్లు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో..

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌రింత ఆల‌స్యం..!

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఒక్క‌టైన ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జ‌న స‌మితి ఇలా ప‌లు పార్టీలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను దాదాపు 105 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేసిన కేసీఆర్ ప్ర‌చార శంఖారావాన్ని కూడా ప్రారంభించారు. మ‌రో ప‌క్క మ‌హాకూట‌మి అభ్య‌ర్థుల లిస్టు మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు. అయితే, తాజా స‌మాచారం మేర‌కు, టీ.కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మరింత ఆల‌స్య‌మ‌య‌యే అవ‌కాశం ఉద‌ని తెలుస్తుంది.

కేసీఆర్‌ను అన్నా అని పిలిచినందుకు సిగ్గుప‌డుతున్నా..చ్ఛి..చ్ఛీ.!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌రప‌డుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల నేత‌లు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. సీఎం కేసీఆర్ పాల్గొన్న టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతుంటే.. మ‌రో ప‌క్క  కేసీఆర్ స‌ర్కార్‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌ను తీవ్ర‌త‌రం చేశారు. ఇలా విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. 

మిమ్మ‌ల్ని న‌మ్మినందుకు నాకు ఈ శాస్తి జ‌ర‌గాల్సిందే :ఎన‌్టీఆర్‌

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, టాలీవుడ్ న‌ట రుద్రుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తాజాగా తెర‌కెక్కిన చిత్రం. ఇవాళ (సెప్టెంబ‌ర్ 11) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, చిత్రం ప్రమోష‌న్‌లో భాగంగా, ఇటీవ‌ల ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌ను సునీల్ చేసిన ఇంట‌ర్వ్యూ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

ఈ నెల 12న ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయొచ్చు :హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ‌తో పాటు శ‌శాంక్‌రెడ్డి వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పును రిజ‌ర్వులో పెట్టింది. ఈ నెల 12న ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేయొచ్చ‌ని సూచించింది. ఓట‌ర్ల జాబితాపై అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఓట‌ర్ల జాబితా పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 12కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

అమృత‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టిన వ్య‌క్తి అరెస్ట్‌..!

అమృత, ప్ర‌ణ‌య్ ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయిన పేర్లు. అంతేకాకుండా, వీరిద్ద‌రిపై పోస్ట్ అయిన వీడియోస్‌ సైతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూ.. ట్రెండింగ్‌లో నిలిచాయి. దీనికంత‌టికీ కార‌ణం, ప్ర‌ణ‌య్‌ను తాను పెళ్లి చేసుకున్న అమృత తండ్రి మారుతీరావు దారుణంగా హ‌త్య చేయించ‌డ‌మే. మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఈ హ‌త్యా ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల‌నే ఒక్క కుదుపు కుదిపేసింది. దీంతో ప్రేమ పెళ్లే ఇందుకు కార‌ణ‌మ‌ని కొంద‌రు.. కాదు.. కాదు ప్ర‌ణ‌య్ ద‌ళితుడు కాబ‌ట్టే అత‌న్ని హ‌త్య చేయించార‌ని మ‌రికొంద‌రు ఇలా వారి వారి అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.