Janasena

ఎన్నిక‌ల్లో పోలింగ్‌శాతం పెంచేందుకు స‌రికొత్త యాప్స్‌..!


ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల బృందం మూడు రోజుల‌పాటు తెలంగాణ‌లో విస్తృతంగా ప‌ర్య‌టించింది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌కీయ పార్టీల నుంచి ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డంతోపాటు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టిని సారించింది. అయితే, నేటితో ప‌ర్య‌ట‌న ముగిసిన సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

అరే.. మీ కొడుకు లోకేష్‌కు ఏం తెలుసండీ..!

అరే.. మీ కొడుకు లోకేష్‌కు ఏం తెలుసండీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు, ఐటీశాఖ మంత్రి లోకేష్‌ను మ‌రోసారి టార్గెట్ చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఈ సారి మ‌రింత సూటిగా, స్ప‌ష్టంగా విమ‌ర్శ‌నాస్త్రాల‌ను ఎక్కుపెట్టారు. లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం నుంచి మొద‌లు పెట్టి జ‌న్మ‌భూమి క‌మిటీలు, ఇసుక మాఫియా,  ప్ర‌త్యేక హోదా, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు ఇలా అన్ని అంశాల‌పైనా వ‌రుస‌పెట్టి ప్ర‌శ్న‌లు సంధించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

జ‌న‌సేన‌కు ఓటేస్తే గెలిచేది ఎవ‌రో తెలుసా..?

జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుపై చేయ‌త‌ల‌పెట్టిన మ‌హా క‌వాతులో పాల్గొనేందుకు జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జ‌న‌సేన పార్టీ త‌న బ‌లాన్ని చూపించాల‌నే ఉద్దేశంతో ఈ క‌వాతును చేసేందుకు నిర్ణ‌యించ‌లేద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తానన్న‌ది, కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న‌ది ఇవ్వ‌లేద‌ని నిరూపించేందుకు జ‌న‌సేన ఈ క‌వాతును ప్రారంభించింద‌న్నారు. 

జ‌న‌సేన క‌వాతుకు అనుమ‌తి నిరాక‌రించిన పోలీసులు


జ‌న‌సేన పార్టీ త‌ల‌పెట్టిన క‌వాతుకు ఆదిలోనే బ్రేక్ ప‌డుతోంది. ఈ కవాతుకు ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ అనుకూలంగా లేద‌ని, ప‌క్క‌నే ఉన్న పిట్ట‌గోడ‌లు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని పోలీసులు అంటున్నారు. బ్యారేజీపై ప‌దివేల‌మందికంటే ఎక్కువ మందికి స‌భా ప్రాంగ‌ణం స‌రిపోద‌ని వేరే చోట స‌భ‌ను జ‌రుపుకోవాల‌ని తెలిపారు.

కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌..!


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుందామ‌నుకుంటున్న ఏపీ కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉనికిని నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు నాదెండ్ల మ‌నోహ‌ర్‌ షాక్ ఇచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన మ‌నోహ‌ర్ ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేర‌బోతున్నారు.