YSRCP

జ‌గ‌న్ సీఎం అయితే.. ఇంటింటికీ కుళాయి :  జోగి రమేష్‌

జ‌గ‌న్ సీఎం అయితే.. ఇంటింటికీ కుళాయి :  జోగి రమేష్‌

కృష్ణా జిల్లా పెడ‌న మండ‌లం కాక‌ర్లలోని మూడు పంచాయ‌తీల్లో రావాలి జ‌గ‌న్ - కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాల‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు  ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేశారు. వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే  ప్ర‌తీ పేద‌వాడికి ఇఝ‌ల్లు క‌ట్టిస్తామ‌ని,  ఇంటింటికీ కులాయి ఏర్పాటు చేస్తామ‌ని జోగి ర‌మేష్ హామీ ఇచ్చారు.

చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?

చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?


ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. తాడేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం వెంక‌ట‌రామ‌న్న గూడెంలో మీడియా సాక్షిగా చ‌ర్చ‌కు రెండు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. బుధ‌వారం రాత్రే టీడీపీ నేత ముళ్ల‌పూడి బాపిరాజును ఓ టీడీపీ కార్య‌క‌ర్త ఇంట్లో నిర్బంధించారు పోలీసులు.

Tags

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

న్యాయం కోసం..

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై జరిగిన హ‌త్యాయ‌త్నంపై నిష్పక్ష‌పాతంగా ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను వైసీపీ నేత‌ల బృందం కోరింది. మ‌ధ్యాహ్నం రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి కేసు ద‌ర్యాప్తు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం అనుమానాస్ప‌దంగా ఉంద‌ని ఘ‌ట‌న వెనుక ఉన్న వ్య‌క్తులు ఎవ‌రు..? ఏ  ల‌క్ష్యం కోసం చేశారు..?  నిందితుడిని ఎవ‌రు ప్రోత్స‌హించారు...?  అన్న ప్ర‌ధాన అంశాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌లుగులోకి రాలేద‌ని ఫిర్యాదు చేశారు.

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

చంపేది ఎవరు? కాపాడేది ఎవరు?

వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కధ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడి వెనుక రాజకీయకోణం దాగి ఉందని వస్తున్న వార్తల నేపధ్యంలో నిందితుడు శ్రీనివాస్ స్పందించాడు. ప్రజా సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే దాడి చేశా అన్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా ఐతే దేవుడు అనుకుంటున్నారో, అలానే జగన్ ను కూడా దేవుడిగా భావించాలనే ఉద్దేశంతోనే దాడి చేశానని చెప్పాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు ప్రాణహాని ఉందని వెల్లడించాడు. తనను కాపాడవల్సిందిగా మీడియాను కోరాడు.

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌

జ‌గ‌న్‌పై దాడి.. ఓ డ్రామా :నారా లోకేష్‌


ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. వైఎస్ జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న వైసీపీ డ్రామానే అని నారా లోకేష్ అన్నారు.  కోడి క‌త్తి వెనుకున్న నిజం మాత్రం మారదు అన్నారు. వైసీపీ ఆడిన ఈ డ్రామాలో వైఎస్ జ‌గ‌న్ అడ్డంగా దొరికిపోయార‌ని నారా లోకేష్ అన్నారు. అంతేకాకుండా,  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని.. జ‌గ‌న్ మోడీ రెడ్డిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. కుట్ర‌ను బ‌య‌ట‌పెడితే అంతు చూస్తామ‌ని అంటూ పోలీసులను బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు మంత్రి లోకేష్‌. 

సీఎం చంద్ర‌బాబుకు ఎమ్మెల్యే రోజా ఓపెన్ ఛాలెంజ్‌

వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన అనంత‌రం నేరుగా విశాఖ ఆస్ప‌త్రికి కాకుండా నేరుగా హైద‌రాబాద్ లోట‌స్ పాండ్లోని త‌న ఇంటికి వెళ్లి ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి వెళ్లార‌ని చంద్ర‌బాబు నిరూపించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిని వైసీపీ రాజ‌కీయం చేయ‌డం లేద‌ని.. చంద్ర‌బాబు అండ్ కో బ్యాచ్ రాజ‌కీయం చేస్తుంద‌న్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తికి గుండెపోటు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్, టీడీపీ ఎమ్మెల్సీ కావ‌లి ప్ర‌తిభా భార‌తి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కాగా, ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తి తండ్రి జ‌స్టిస్ పున్న‌య్య (92) అనారోగ్యంతో విశాఖ న‌గ‌రంలోని పినాకిని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ప్ర‌తిభా భార‌తికి ఒక్క‌సారిగా గుండెపోటు వ‌చ్చింది.

క‌త్తి దాడి అనంత‌రం జ‌గ‌న్ వైర‌ల్ ట్వీట్‌

క‌త్తి దాడి అనంత‌రం జ‌గ‌న్ వైర‌ల్ ట్వీట్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఓ యువ‌కుడు క‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే. విశాఖ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుని మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. అయితే, త‌న‌పై దాడి జ‌రిగిన వెంట‌నే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రాథ‌మిక చికిత్స పొందిన జ‌గ‌న్‌.. అనంత‌రం హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు.