Politics

ప్ర‌లోభాల ప‌ర్వంలో నేత‌లు..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంతో ఇవాళతో క‌లిపి  మూడు రోజులే ఉండ‌టంతో అభ్య‌ర్థులు ఉరుకులు, ప‌రుగులు పెడుతున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తెర వెనుక త‌మ ప్ర‌య‌త్నాల‌ను పూర్తిస్థాయిలో చేస్తున్నారు. త‌మ‌తోపాటు ప్ర‌చారంలో పాల్గొంటున్న వారిని మంచిగా చూసుకోవ‌డంతోపాటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వ‌ల వేస్తున్నారు. స్థాయినిబ‌ట్టి బ‌హుమ‌తులిచ్చి మంచి చేసుకుంటున్నారు. 

తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌రో అరుదైన దృశ్యం..!

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేడు మ‌రో అరుదైన దృశ్యం క‌నిపించ‌బోతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు నేడు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వంలో పాల్గొన‌నున్నారు. రాహుల్ గాంధీ ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల ప్ర‌చారంలో పాల్గొన‌గా మోడీ రెండు స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఈ ఇద్ద‌రు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేందుకు చివ‌రి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్..?

ద‌మ్ముంటే నాపై పోటీ చెయ్..?

ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ద‌మ్ము, ధైర్యం ఉంటే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. రాహుల్ స‌భ‌ల‌కు, మ‌ద్యం, బిర్యానీ ఇచ్చి త‌ర‌లిస్తున్నార‌ని అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఎంఐఎం పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో తెరాస‌ను ఓడించాల‌న్న అస‌దుద్దీన్ మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హాకూట‌మిని చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

మ‌రోసారి హైద‌రాబాద్‌కు చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రేపు మ‌రో సారి హైద‌రాబాద్‌కు రానున్నారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న త‌మ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల త‌రుపున దాదాపు ఐదు రోజుల‌పాటు ప్ర‌చారం చేయ‌నున్నారు. 

ఎవ‌రేం చేశారో ప్ర‌జ‌ల‌కు తెలుసు :   కేసీఆర్‌

స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ అన్ని విధాలుగా న‌ష్టపోయింద‌ని, నాడు పాల‌న చేసిన కాంగ్రెస్‌, టీడీపీ ప్ర‌భుత్వాలు దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయ‌ని, దీంతో ప్ర‌జ‌ల అభివృద్ధి కుంటు ప‌డింద‌ని తెరాస అధినేత‌, ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ అన్నారు. కాగా ,ఇవాళ ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ ప్ర‌పంచ‌లో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, అయినా రాజ‌కీయ ల‌బ్ధి కోసం తెరాస‌పై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

Tags

జ‌గ‌న్‌కు అధికారం ఎప్పుడూ దూర‌మే  :ప‌వ‌న్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌జా పోరాట యాత్రను నిర్వ‌హించారు. గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్నందున జిల్లాపై ప‌ట్టు సాధించే దిశ‌గా ప‌వ‌న్ యాత్ర సాగింది. 17 బ‌హిరంగ స‌భ‌ల్లో టీడీపీ, వైసీపీల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్‌. ఉద‌యం సామాజిక‌వ‌ర్గాల వారీగా స‌మావేశాలు సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో జిల్లాను ద‌ద్ద‌రిల్లించారు. చివ‌రిగా కోన‌సీమ‌లోని అమ‌లాపురంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ విజ‌య‌వంత‌మైంది. 

పెత్త‌నం చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు

పెత్త‌నం చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు

 ప్ర‌జా కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. తెలంగాణపై పెత్త‌నం చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని శేరిలింగంప‌ల్లిలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ రోడ్‌షోలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. బీజేపీ, తెరాస ముఖ్య నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గిరిజ‌నుల‌కు అండ‌గా కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీ గిరిజ‌నుల అభివృద్ధికి ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంద‌ని, గిరిజ‌నుల కోసం నాడు కాంగ్రెస్ హ‌యాంలో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని, కానీ, ఆ ప‌థ‌కాన్నింటిని తెరాస ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసింద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ అన్నారు. కాగా, ఇవాళ భూపాల‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొని ప్ర‌సంగించారు.

Tags

ఓట్ల కోసం ఎంత‌కైనా దిగ‌జారుతారా..?

ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ఎంతకైనా దిగ‌జారుతారా..? మేమేన్నా గొర్రెల‌మా..? అంటూ తెలంగాణ ప్ర‌తిప‌క్షాల‌పై ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి, తెరాస అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఫైర‌య్యారు. కాగా, ఇవాళ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో నిర్వ‌హించిన తెరాస ఆశీర్వాద బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన మ‌హాకూట‌మి, బీజేపీ, పార్టీల నేత‌ల‌పై కేసీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ, బీజేపీ అధ్య‌క్షులు అమిత్ షా తెలంగాణ‌లో క‌రెంటు లేదంటారా..?

Tags