Anchor Suma Takes Shocking Decision | Star Mahila Show Stopped

             Anchor Suma Takes Shocking Decision | Star Mahila Show Stopped 

        యాంకర్ సుమ.. తెలుగు టీవీ, మూవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రొఫెషన్నే ఇంటిపేరుగా మార్చుకున్న సుమ.. ఆ ప్రొఫెషన్లో తాను ఇంత గట్టిగా నిలబడడానికి దోహదపడ్డ ప్రోగ్రాం ‘స్టార్ మహిళ’ అని ఎన్నోసార్లు చెప్పుకుంది. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ సుమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కూడా దక్కింది. బుల్లితెరపై యాంకర్లు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. తన సరదా మాటలు, ముచ్చట్లతో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే చాలా టెలివిజన్ ఛానళ్లు ఆమెను వ్యాఖ్యాతగా తీసుకుంటాయి. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోలలో చాలా పాపులర్ అయిన కార్యక్రమం ‘స్టార్ మహిళ’. బుల్లితెరపై తిరుగులేని షోగా పేరు తెచ్చుకుంది ‘స్టార్ మహిళ’ కార్యక్రమం. మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంను ఆపేస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతుంది ఈ షో హోస్ట్ సుమ. సుమారు 12 సంవత్సరాలుగా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు కూడా దక్కింది. మరి అలాంటి షోని సడెన్గా ఎందుకు ఆపేస్తున్నారు అనేది తెలియాలంటే.. తాజాగా ఫేస్బుక్లో సుమ పోస్ట్ చేసిన వీడియో చూడాల్సిందే.‘‘మీ అందరికీ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. మీరు సుమ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ‘స్టార్ మహిళ’ కార్యక్రమం.

         ఏకధాటిగా గత 12 ఏళ్లుగా ఈ షో విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ షోను ఆదరించినవారందరికీ శతకోటి వందనాలు. కానీ, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు. అదే విధంగా ‘స్టార్ మహిళ’ ప్రయాణం కూడా ముగియనుంది. మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘స్టార్ మహిళ’కు చిన్న ముగింపు పలుకుతున్నాం. త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్ను ప్రసారం చేయబోతున్నాం. మీరు నాకు, స్టార్ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే మీరు ఒక చిన్న పని చేయండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకోండి. వాటిలో బెస్ట్ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్లో ప్రసారం చేస్తాం. చిన్నా.. పెద్దా అన్న తేడాలేకుండా ప్రతిఒక్కరూ ‘స్టార్ మహిళ’ కార్యక్రమాన్ని ఆదరించారు. వారందరి ప్రేమను, స్టార్ మహిళ ప్రోగ్రామ్ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’’ అని సుమ ఈ వీడియోలో తెలిపారు.ఏదేమైనా.. బహుభాషా ప్రావీణ్యురాలిగా, అరుదైన వక్తగా తెలుగు జన హృదయాల్లో నిలబడిపోయిన ఈ మెగా యాంకరమ్మ ‘స్టార్ మహిళ’ నిలిపివేతతో పాక్షికంగా రిటైర్ అయినట్లే లెక్క!అయితే ఈ షో ని అభిమానించే అభిమానులు మాత్రం షో ను అర్ధాంతరం గా ఆపేయడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ..ఎప్పటినుండో ఈ షో ను వీక్షిస్తూ ,ఎంజాయ్ చేస్తున్నాము అని దీనిని అప్పవద్దు కంటిన్యూ చేయమని పలువురు ఛానల్ వారికి కాల్స్ చేసి మరీ చెబుతున్నారు ..ఏది ఏమైనా ఇంత మంది అభిమానులను చూరగొన్న ఈ షో ని మళ్ళీ ప్రసారం చెయ్యాలని కోరుతున్నారు ..మరి అభిమానుల కోరిక ను ఆ ఛానల్ తీరుస్తుందా లేక షో ను ఆపేస్తుందా చూడాలి ..

Comments