కేరళ భీభత్సం తనప్రాణాలకి తెగించి కుక్కప్రాణాలని కాపాడిన సామాన్యుడు | Man Saved Dog In Kerala Floods

            కేరళ భీభత్సం తనప్రాణాలకి తెగించి కుక్కప్రాణాలని కాపాడిన సామాన్యుడు |

           కేరళలోని ఇడుక్కి రిజర్వాయర్ పొంగి పొర్లి విధ్వంసం సృష్టించింది. రాష్ట్రంలోని పెద్ద విపత్తులలో ఒకటిగా చెప్పుకుంటున్న ఈ విధ్యంసంలో 100 మంది పైగా మృత్యువాత పడ్డారు. సుమారు 35,000 మంది పునరావాస శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది.కాగా ఓ కుటుంబాన్ని వారి పెంపుడు శునకం వదలల్లో చిక్కిపోకుండా కాపాడింది. ఇడుక్కి జిల్లాలోని కంజికుజ్జి గ్రామానికి చెందిన మోహనన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నారు. ఇంతలో వారి పెంపుడు కుక్క అరవడం ప్రారంభించింది. దీంతో మోహనన్ దాన్ని వారించే ప్రయత్నం చేశాడు. ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉన్న కుక్క తర్వాత పెద్ద ఊళ వేయడం ప్రారంభించింది.దీంతో ఏదో ప్రమాదం ఉందని భావించిన మోహనన్.. తన కుటుంబంతో కలిసి దగ్గరలోని ప్రభుత్వ సహాయ శిబిరానికి మారిపోయారు. అనుకున్నట్టుగానే వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్ది సమయానికే దగ్గరలోని కొండ చరియలు విరిగి ఇంటిపై పడ్డాయి.

        ఈ విషయమై మోహనన్ మాట్లాడుతూ ‘ఎన్నడూ లేని విధంగా మా శునకం పెద్దగా ఊళ పెట్టడం ప్రారంభించింది. వెంటనే ఏదో ప్రమాదం పొంచి ఉందని నేను భావించాను. అనుకున్నదే తడవుగా కుటుంబంతో సహా దగ్గరలోని ప్రభుత్వ సహాయ శిబిరానికి మారిపోయాం. లేదంటే శిథిలాల్లో చిక్కుకొని ఈ పాటికే తనువు చాలించే వాళ్లం’ అని చెప్పుకొచ్చారు.ఇదేనేమో కుక్క చూపించే విశ్వాసం ...విశ్వాసానికి మారు పేరు అని మరోసారి రుజువు చేసింది ఈ కుక్క ...ఇక ఇది ఇలా ఉండగా ఇంకో పక్క ఒక కుక్క పిల్ల నీటిలో ములిపోతూ ఉండగా ఇంకో కుక్క దానిని నోటికి కరుచుకుని ఎలా కాపాడిందో చూస్తే నిజం గా మనుషులకు లేని ఐకమత్యం ఆ కుక్క లో కనిపిస్తుంది ..ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు శత్రువునైనా కాపాడాలి అనే నీతి మనకు ఇది చూస్తే అర్ధం అవుతుంది ..ఇక ఇంకో పక్క ఈ వీడియో చుడండి ..వరదలో కొట్టుకు పోతున్న ఈ కుక్కను ప్రాణాలకు తెగించి ఈ వురి జనం ఎలా కాపాడారో ...నీటిలో కొట్టుకు పోతున్న కుక్క ను ఒకరికి ఒకరు చెయ్యి చెయ్యి పట్టుకుని దానికి చెయ్యిని అందిస్తే అది ఆ చేతిని అంది పుచుకుని ఎలా ప్రాణాలతో బయట పడిందో చుడండి ..నీటిలో కొట్టుకు పోతు ,తల ఒకటి పైకి లేపి ప్రాణాలతో పోరాడుతూ సహాయం కోసం ఎదురు చుసిన ఆ కుక్క ను ఆ వురి ప్రజలు చక చక్యం గా కాపాడారు ..నోరు లేని జంతువు అయిన కుక్క ,తాను చని పోతాను అని తెలిసి వచ్చిన వారు తనని కాపాడడానికి వచ్చారు అని అర్ధం చేసుకుని తన ప్రాణాలను నిలుపుకోవడం కూడా నిజం గా మనుషుల్ని అర్ధం చేసుకోవడం లో కుక్క తర్వాతే ఏ జంతువు అయినా అని అర్ధం అవుతుంది ...

Comments