Kaushal Army Fires on Deepthi Sunaina | Bigg Boss 2 Telugu | Deepthi Sunaina Out | Nani Bigg Boss 2

              Kaushal Army Fires on Deepthi Sunaina  

         బిగ్ బాస్ సీజన్ 2లో పదోవారం వచ్చేసరికి కంటెస్టెంట్స్‌లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 65 ఎపిసోడ్లు పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ రేస్‌లో నిలిచి ఫైనల్ పోరులో గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.బిగ్ బాస్ హౌస్‌లో ‘కాల్ సెంటర్’ టాస్క్ ప్రారంభమైన తరువాత సామ్రాట్ - గీతా మాధురిల మధ్య క్లోజ్ నెస్ అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో గీతా మాధురీ, సామ్రాట్ల చూపుల యుద్ధం జరిగింది. ఒకరినొకరు చూసుకుంటూ గడిపేశారు. ఇక నేటి ఎపిసోడ్లు ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ సరదా సరదాగా ఆడుకుంటూ హగ్ ఎలా ఇస్తారు.. లిప్ స్టిక్ ఎలా పూయాలి అన్న దానిపై ట్రయల్స్ వేశారు. దీప్తి సునయన లిప్ స్టిక్ రాస్తే.. రాయించుకుంటావ్.. నేను రాస్తుంటే తప్పించుకుంటున్నావ్. ఒకరికి ఫేవర్‌గా మరొకరికి దూరంగా ఉండటం ఏంటంటూ సామ్రాట్ షర్ట్‌కి లిప్ స్టిక్ పూసింది గీతా మాధురి. సామ్రాట్‌తో నేను బాగా క్లోజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటూ గీతా మాధురి.. శ్యామలతో అనడం ఆమె ఏం పర్లేదు ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉండొచ్చు అంటూ గొప్ప సలహా ఇచ్చింది. ఈ టాస్క్‌లో భాగంగా..

        తొలిత కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న కౌశల్‌ను టార్గెట్ చేశారు దీప్తి సునయన, గీతా మాధురిలు.అనంతరం కౌశల్‌తో స్టార్టింగ్‌లోనే ఎటాక్‌కి దిగింది సునయన. అసలు ఏంటి నీ బాధ. బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేయాలనుకుంటున్నావ్.. జనాలు నిన్ను ఎలా చూస్తున్నారో ఏమో కాని.. అసలు నీకు ఓట్లు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు. నీ నటన గురించి వాళ్లకు తెలియక పోవడం వల్ల నువ్ తెగ ఫీల్ అయిపోతున్నావ్. నిజం చెప్పాలంటే నీకసలు బిగ్ బాస్ హౌస్‌లో ఉండే అర్హతే లేదు. బిగ్ బాస్ హౌస్‌లో నీ ప్రవర్తను ఎలా ఉందో 24 గంటలు జనం చూస్తే.. నీ ముఖం మీద తూ... అని ఊస్తారు. నువ్ పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు. నీకు తెలియడం లేదేమో నువ్ హీరోవి కాదు జోకర్‌వి అవుతున్నావ్. నేను సంచాలకురాలుగా ఉన్నప్పుడు నాకు నీ సలహాలు ఏంటి? జడ్జ్మెంట్లో నీ బోడి సలహాలు ఏంటి? అది నా ఇష్టం. తనీష్‌తో నేను ఉంటే నీ ఏంటి? అతనిపై నీ గజ్జి ఏంటి? పూజా నిన్ను సపోర్ట్ చేస్తే.. ఆమె కెప్టెన్సీపై నువ్వు నిందలు వేస్తావా? నువ్ ఏకాకిగా ఉన్నా అంటూ ఏడుస్తున్నావ్. నీ ప్రవర్తన వల్లే నిన్ను అలా చేస్తున్నాం అంటూ కౌశల్ సహనానికి పరీక్ష పెట్టింది సునయన. ఇక కౌశల్‌ని పాట పాడు, లవ్ సాంగ్ పాడు, స్టోరీ చెప్పు అనడంతో సునయన గతంలో నడిపిన ప్రేమకథల్ని, అందులో ఉన్న వ్యక్తులు పేర్లు వచ్చేలా పదే పదే జస్వంత్, షణ్ముక్ పేర్లతో కథలు అన్ని సునయన విసిగించాడు కౌశల్. ఇక లవ్ సాంగ్ పాడమంటే.. బిగ్ బాస్ హౌస్‌కి ప్రేమలో పడితే చెల్లమ్మా.. పడుకుంటే చెల్లెమ్మా..

         జనం బయటకు తోసేస్తారు చెల్లెమ్మా అంటూ సునయనకు కౌంటర్లు వేశాడు కౌశల్. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పు అంటే.. హౌస్‌లో రన్నింగ్ టాస్క్ ఇస్తే అందులో పాల్గొన్న అమ్మాయి లిఫ్టిక్ సరిచేసుకుంటూ వెనుకున ఉండిపోతే.. ఇంకొక వ్యక్తి ఆమెను రన్నింగ్‌లో గెలిపించడం కోసం త్యాగం చేశారు అంటూ తనీష్, సునయన రన్నింగ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ చెప్పిన స్టోరీకి కన్నీళ్లు పెట్టుకుంది సునయన. ఇక ఈ టాస్క్ లో యాంకర్ దీప్తి తో కౌశల్ మాట్లాడుతుండగా ,దీప్తి సునయన కాలు ఎత్తి చూపించింది .అయితే ఈ విషయం పై కౌశల్ అభ్యంతరం వ్యక్తం చేసాడు ..ఇది నీ మర్యాదకు కరెక్ట్ కాదు అంటూ ఆమెపై విరుచుకు పడ్డాడు .ఇప్పుడు దీప్తి సునయన కౌశల్ పై కాలు చూపించడం బయట వున్నా కౌశల్ ఆర్మీ కి ఏ మాత్రం నచ్చడం లేదు ...ఈ వారం దీప్తి సునయన eliminate చేసే పని లో కౌశల్ ఫాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ..ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకం గా గాని ,కౌశల్ తో గొడవకు దిగిన వారికి ఎలాంటి గతి పట్టింది అందరికి తెలుసు ,,అదే క్రమం లో దీప్తి పై కౌశల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు ...

Comments