మరో పెళ్ళి చేసుకున్న యాంకర్ ఝాన్సీ మాజీ భర్త | Anchor Jhansi Husband Jogi Naidu Got Second Marriage

           యాంకర్ ఝాన్సి మాజీ భర్త....మరో పెళ్లి

       ప్రముఖ వర్ధమాన నటుడు యాంకర్ జోగినాయుడు ద్వితీయ వివాహం చేసుకున్నాడు...విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నాడు...అయితే వివాహం కొంత చర్చనీయాంశంగా మారింది...గతం లో ప్రముఖ యాంకర్ ఝాన్సి పై మనసుపడ్డాడు, పరిచయం పెరిగి, పెళ్లి కి దారి తీసింది...నిజానికి జెమినీ టీవీలో ఒక  ప్రోగ్రాం డైరెక్టర్ గా జోగినాయుడు పనిచేస్తున్న సమయంలో , యాంకర్ ఝాన్సీకి పరిచయం అయ్యింది. దర్శకుడు అవ్వాలని వచ్చిన జోగినాయుడు పరిస్థితుల వల్ల నటుడిగా మారాడు. టీవీ ప్రోగ్రామ్లో 'ఏంటిరా అన్నియా' అంటూ తన వింత గళంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈవీవీగారి దగ్గర సహాయ దర్శకుడిగా  తర్వాత పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ దగ్గర పనిచేశాడు. బుల్లితెరతో గుర్తింపు సాధించాక సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. జోగిబ్రదర్స్గా కృష్ణంరాజుతో కలిసి ఎక్కువగా నవ్వించే పాత్రలే పోషించాడు...అలాగే 'నటుడిగా కొనసాగుతూనే ఎల్‌.జె.స్టూడియోని స్థాపించి అందులో మూడొందల చిత్రాలకి నిర్మాణానంతర కార్యక్రమాలను చేశాడు..త్వరలో ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నాడు జోగినాయుడు..

Comments