F1 Racer Michael Schumacher Untold Biography & Life Story | Intresting Facts About F1 Racer Michael

        వేగానికే ఒణుకుపుట్టించిన ఫార్ములా వన్ రేసర్ ..షుమాకర్ ఇప్పుడెలా ఉన్నాడు...?

        ఫార్ములా వన్ రేస్ గురించి చెబితే చాలు వెంటనే గుర్తొచ్చే పేరు మైకేల్ షుమాకర్.అది 1992 ఆగస్టు 30వతేదీ షుమాకర్ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన  రోజు.  ఆరోజు  బెల్జియం గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసు జరుగుతూ ఉంది. అందరి కళ్లూ గ్రేట్‌ బ్రిటన్‌ డ్రైవర్‌ అయిన నిగెల్‌ మాన్సెల్‌ మీదే ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు జరిగిన నాలుగు ఎఫ్‌-1 రేసుల్లో మూడుసార్లు అతనే విజయాన్ని సాధించాడు. ఈ రేసులో కూడా అతనే విన్ అవుతాడని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ రేసు ముగిసేసరికి    23 ఏళ్ల జర్మనీ యువ డ్రైవర్‌ అయిన మైకేల్  షుమాకర్ అనేవ్యక్తి నిగెల్‌ను వెనక్కి నెట్టి టైటిల్‌ ని ఎగరేసుకుపోయాడు. ఆ ఏడాది ఎఫ్‌-1 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో షుమాకర్ ది  మూడో స్థానం. సరిగ్గా రెండేళ్లు తిరిగేసరికి షుమాకర్  ఛాంపియన్‌ గా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరుసటి ఏడాది  ఛాంపియన్‌షిప్‌ ని కూడా అతనే సాధించాడు. 2000 సంవత్సరము నుంచి 2005 సంవత్సరాల మధ్య వరుసగా ఐదేళ్ల పాటు అతనే ప్రపంచ ఛాంపియన్‌. ఫార్ములావన్‌ చరిత్రలోనే ఇలా వరుసగా ఐదేళ్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రేసరే  లేడు.

         ఇలా గణాంకాల్లో కొలిస్తే షుమాకర్ కి  సాటి వచ్చే రేసర్‌ ఎఫ్‌-1 చరిత్రలోనే కనిపించడు. ఇక షుమాకర్ డ్రైవింగ్‌ నైపుణ్యం అసామాన్యం..అతని  వేగం  అసాధారణం. వందల కోట్ల ప్రైజ్‌మనీని సాధించి.. వేల కోట్ల అదనపు ఆదాయం ఆర్జించి.. అంతకంటే విలువైన అభిమానాన్ని సంపాదించి.. ఫార్ములావన్‌ లోనే కాక ప్రపంచ క్రీడా చరిత్రలోనే దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మైకేల్, మంచు పర్వతాల్లో స్కీయింగ్‌ చేయడం అన్నా అంతే యిష్టం. అప్పుడప్పుడూ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ కలిసి  మంచు పర్వతాలకి వెళ్లి స్కీయింగ్ చేసి తన సరదా తీర్చుకొనేవాడు. అతను 2013లో ఎఫ్‌-1కు టాటా చెప్పేయడంతో కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం గడుపుతూ వస్తున్నాడు.

        ఒక  రోజు మైకేల్‌, తన కొడుకు మిక్‌ షుమాకర్‌, మరికొందరు మిత్రులతో కలిసి ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాలకు వెళ్లాడు . ఎప్పట్లాగే ఉత్సాహంగా స్కీయింగ్‌ చేస్తున్న అతను, ఒకచోట అదుపు తప్పి,ఎగిరి పడ్డంతో అతని తల  ఒక బండ రాయికి బలంగా తగిలింది. హెల్మెట్‌ ఉన్నప్పటికీ   అతనుపడిన ఫోర్స్ కి అతని తల పగిలింది. ఒంటినిండా తీవ్ర గాయాలు.పడీపడ్డంతోనే  షుమాకర్‌ స్పృహ కోల్పోయాడు. కొడుకు మరియు  అతని స్నేహితులూ కలిసి,షుమాకర్  ని  హెలికాఫ్టర్‌ లో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమమని తేలింది. మైకేల్‌ ప్రాణం కాపాడటానికి వైద్యులు చేయాల్సిన ప్రయత్నమంతా చేశారు. రెండు పెద్ద శస్త్రచికిత్సలు చేశారు. కృత్రిమ కోమాలో ఉంచి అతడికి చికిత్స అందించారు. షుమాకర్‌ కి జరిగిన ప్రమాదం గురించి .  కొన్నాళ్లకి  ప్రాణాపాయం తప్పిందని, కానీ షుమాకర్‌ మామూలు స్థితికి ఎప్పుడొస్తాడో తెలియదని వైద్యులు ప్రకటించారు. నాలుగు నెలల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చాడు మైకేల్‌. ఇంకా కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగింది.తర్వాత కొన్ని నెలలకి ఇంటికి వచ్చాడు.షుమాకర్‌ పక్షవాతానికి గురై, లేచి నిలబడే పరిస్థితిలో లేకపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు.

Comments