పరిపూర్ణానంద స్వామి పోటీ అక్కడ నుండే || Paripoornananda Swamy Political Entry From That District

        పరిపూర్ణానంద....2019 కాబోయే మరో యోగి..ప్రజలు కోరుకుంటే! సిద్ధంగా ఉన్నాను

        స్వామి పరిపూర్ణానంద రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా సిఎం అభ్యర్ధి గానే పోటీ చేయనున్నారా? ఇందుకు ఆదర్శంగా యూపి సిఎం యోగి ఆదిత్యనాద్ బాటలో నడవనున్నారా? ప్రస్తుతం పరిపూర్ణానంద వైఖరి చూస్తూంటే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి...నిజానికి పరిపూర్ణానంద ఎప్పటినుండో ధర్మ పరిరక్షణ కోసం, హిందూధర్మ శ్రేయాస్సుకోసం నేను ఏం చేయడానికైనా సిద్దమే అని చెప్పుకుంటూ వస్తున్నారు....తన జేవితం తన చేతిలో లేదని, నేను ధరించిన కాషాయం బట్టలు అంత దైవ సంకల్పమే అని, చెప్పుకోచ్చారు...ఒకవేళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి కాషాయమే అడ్డు వస్తే దాన్ని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నానని గతం లో ఎన్నో సందర్భాల్లో వివరించారు...ప్రముఖ జాతీయ పార్టీ దిశగా  ఆయన అడుగులు పడుతున్నాయన్నది నర్మగర్భితంగా ఉన్న వాస్తవం...తెలుగు రాష్ట్రాల్లో తన బోధనలతో ప్రచారంలోకి వచ్చిన స్వామీ పరిపూర్ణానందను వచ్చే ఎన్నికల బరిలో దింపాలన్న ప్రయత్నం తెరవెనక పార్టీ చేస్తున్న యోచన... నిజానికి యోగీ ఆదిత్య నాధ్ కు, పరిపూర్ణానందకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ 1972లోనే పుట్టారు. పరిపూర్ణానంద ధార్మిక బోధనలతో ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు.

          రాష్ట్రీయ హిందూ సేనను స్థాపించి హైందవ ధర్మం గురించి బోధిస్తున్నారు. హిందూ మత ప్రచారం కోసం పరిపూర్ణానంద కూడా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిజానికి అటు యోగీ ఆదిత్యా నాథ్ రాజకీయాల్లోకి రాకముందు ఆయనకూడా హిందూ ధర్మ రక్షణ ధ్యేయంగా పనిచేశారు. హిందూత్వ వాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. యూపిలోని గోరక్ నాథ్ మఠ వారసుడు అయిన యోగీ, చాలా చిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందారు. యూపీలో మత మార్పిడులను తగ్గించడానికి ఒక ఉద్యమంగా పనిచేశారు. హిందూమతం నుంచి క్రైస్తవంలోకి మారిన వారిని మళ్లీ హిందూ మతంలోకి తీసుకొచ్చారు. హిందూ యువ వాహిని సంస్థ ద్వారా ధార్మిక బోధనలు చేశారు. ఈ నేపధ్యంలో తాజాగా నగర బహిష్కరణ వేటును తాత్కాలికంగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే...కాగా ఆయన ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ....హిందుత్వ రక్షణ కోసం ప్రజలు నన్ను కోరుకుంటే తప్పకుండా ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నానని, ప్రజలు నన్ను కోరుకుంటే అలాగే అంగీకరిస్తానని అంటూ, ఏదైనా దైవ సంకల్పం లేనిదే ఏమి జరుగదు, ఎలా జరగాలో అంతా ఆయనే నిర్ణయిస్తాడు అని చెప్పుకోచ్చారు స్వామీ పరిపూర్ణనంద....

          తెలుగు రాష్ట్రాల్లో కూడా కాషాయాన్ని ఎగురవేయలన్నది కమలం పార్టీ స్కెచ్...2019 ఎన్నికల్లో స్వామీ పరిపూర్నానంద ను దింపాలన్నది భారతీయ జనతా పార్టి ఆకాంక్ష... ఒకవేళ 2019 ఎన్నికల్లో ఫలితం దక్కకపోయినా, 2024లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పరిపూర్ణానంద స్వామీజిని ముగ్గులోకి దింపబోతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.ఒకవేళ ఆయనకాని పోటీ చేయాలంటే ఆయన్ను సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి గానీ, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కానీ పోటీకి దింపుతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే, ఈరెండు చోట్ల నుంచి బీజేపీకి మంచి పట్టుంది. లేదంటే, నిజామాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక  రెండు నియోజకవర్గాలు కాదనుకుంటే, భువనగిరి పార్లమెంట్ బరిలో దింపొచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది.

Comments