Kaushal Army Reacts on Bigg Boss 2 Contestants | Kaushal Army Plan | Deepthi Sunaina |

              కౌశల్ సైన్యం బిగ్ బాస్ మీద పోటీ పడుతోంది

        బిగ్ బాస్ రెండో సీజన్ మొదట్లో కాస్త సాదా సీదాగా నడిచిన రోజులు గడిచే కొద్దీ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మధ్య ఇస్తున్న టాస్క్ లలో కూడా కాస్త మసాలా ఎక్కువ కావటంతో TRP కూడా పైకి దూసుకుపోతుంది. ప్రతి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉండేలా బిగ్ బాస్ టీమ్ డిజైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మొదట్లో ఇంటిలోని సభ్యులు కౌశల్ తో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ తర్వాత కొంతమంది ఎలిమినేట్ కావటంతో మిగతా సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టెలిఫోన్ టాస్క్ లో కౌశల్ మీద ఎంత వ్యతిరేకత ఉందో పార్టిసిపెంట్స్ చూపించారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కౌశల్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు.దీప్తి సునైనా అయితే ఓ రేంజ్ లో ఎటాక్ చేసింది. కౌశల్ పక్కా గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతాడు కాబట్టి దీప్తికి రివర్స్ పంచ్ ఇచ్చాడు. కౌశల్ ఇచ్చిన పంచ్ కి దీప్తి కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక గీతా మాధురి కూడా అదే ఆట ఆడిన కాస్త ఆచి తూచి వ్యవహరించింది. నిన్నటి వరకు కౌశల్ తో ఫ్రెండ్లీ గా ఉన్న గీతా ఫోన్ టాస్క్ లో తన పాత వైఖరిని బయట పెట్టింది.

         పాత విషయాలను చెప్పి కౌశల్ ని ఇబ్బంది పెట్టాలని చుసిన కౌశల్ చాలా కూల్ గా ఉండి గీతా మాధురి ఫోన్ పెట్టేసేలా చేసాడు. గణేష్ కూడా కౌశల్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. హౌస్ లో అందరితో బాగానే ఉండే గణేష్ కౌశల్ మీద ఒంటి కాలిపై లేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అందరితో ఒకేలా ఉండాలని కౌశల్ గణేష్ కి చెప్పాడు.వాటి అన్నింటిని గుర్తు చేసి మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ టెలిఫోన్ టాస్క్ చూస్తూ ఉంటే మొత్తం ఇంటి సభ్యులు కౌశల్ ని టార్గెట్ చేసారని అర్ధం అవుతుంది. ఇలా చేయటానికి కర్త,కర్మ,క్రియ అన్ని తనీష్ అని తెలుస్తుంది. ప్రతి పార్టిసిపెంట్ తనీష్ చెప్పిన విధంగానే కౌశల్ తో దారుణంగా మాట్లాడారు.ఇప్పుడు కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. హౌస్ లో కౌశల్ ఒంటరివాడు అయ్యాడనే కౌశల్ ఆర్మీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ చాల సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం దీప్తి సునైనా ను ఎలిమినేట్ అయ్యేలా చేసిన అంతిమంగా తనీష్ కి డేమేజ్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.హౌస్ లో కౌశల్ కి తనీష్ ప్రధాన శత్రువు అని, మిగతా వారి అండ చూస్కొని తనీష్ కౌశల్ ని టార్గెట్ చేస్తున్నాడని కౌశల్ ఆర్మీ భావిస్తుంది. అందుకే తనీష్ కి సపోర్ట్ చేసే పార్టిసిపెంట్స్ ని ఒకొక్కరిని బయటకు పంపాలని నిర్ణయం తీసుకుంది కౌశల్ ఆర్మీ. మొదట దీప్తి సునైనాతో మొదలు పెట్టి గీతా మాధురి,గణేష్,రోల్ రైడ,తనీష్ ఇలా ఎలిమినేట్ చేయటం ద్వారా హౌస్ ని క్లిన్ చేయాలనీ కౌశల్ ఆర్మీ ప్లాన్ చేసింది.

Comments