Akkineni Supriya Serious on Comedian Ali | Alitho Saradaga Latest News | Madhusalini

              Akkineni Supriya Serious on Comedian Ali |

       తెలుగులో బ్రహ్మానందం కన్నా ముందే కెమెరా ముందుకు వచ్చిన కమెడియన్ ఎవరంటే ఆలీ అని చెప్పాలి. బాల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి,ఇప్పటివరకూ వెయ్యికి పైగా చిత్రాలు చేసిన ఆలీ, సాధించిన ఘనత గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. ఆ రోజుల్లో భారతీరాజా తీసిన బ్లాక్ బస్టర్ సీతాకోక చిలుక మూవీతో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ప్రస్తుతం అగ్రశ్రేణి కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు. ఇతను ఉంటే సినిమాకు మినిమమ్ గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. తమిళ,కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన అలీ,కమెడియన్ గానే కాదు హీరోగానూ మంచి పేరు కొట్టేసాడు.యమలీల వంటి బ్లాక్ బస్టర్ ఆలీ ఖాతాలో ఉందంటే అతని రేంజ్ తెలుసుకోవచ్చు. అప్పట్లో పూట గడవని స్థితి నుంచి ప్రస్తుతం ఖరీదైన బంగ్లా లో ఉంటూ విలాసవంతమైన కార్లలో తిరుగుతున్న ఆలీ,పాత రోజులు మాత్రం మర్చిపోలేదు.

      పేదలకు తోచినంత సాయం చేస్తూ మానవత్వం ఉందని నిరూపించుకున్నాడు.తండ్రి పేరిట మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి,సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు.అంతే కాకుండా ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి వారం ఒక ఆర్టిస్ట్ ని తీసుకువచ్చి వారిని ఎవరు అడగని పర్సనల్ ప్రశ్నలను కూడా అడుగుతూ, వారిలోని ఎమోషన్స్ బయటకు తీయటంలో చాలా యుక్తిని చూపిస్తున్నాడు. అలీ ఇప్పటి వరకు యాంకర్,హోస్ట్ గా చేసిన కార్యక్రమాలకు బిన్నంగా అలీతో సరదాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చే ఆర్టిస్ట్ ల మనోగతాన్ని అభిమానులకు తెలిపే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. వెండితెర నటులనే కాకుండా బుల్లితెర జబర్దస్త్ నటులను కొంత మందిని సెలక్ట్ చేసుకొని వారిని అలీతో సరదాగా కార్యక్రమానికి పిలిచి వారి మనస్సులోని మాటలను చెప్పేస్తున్నాడు.ఈ కార్యక్రమానికి అలీ అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి సినిమా లో పవన్ కళ్యాణ్ తో జోడిగా నటించిన సుప్రియ ను ఈ వారం గెస్ట్ గా తీసుకు వచ్చాడు ..

          షో లో భాగం గా కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది ..అయితే ఈమె తో పాటు హీరోయిన్ మధు షాలిని కూడా సుప్రియ సందడి చేసింది ...పలు ఫన్నీ క్వషన్స్ తో సాగిన ఈ షో ఆలీ అడిగిన ఒక ప్రశ్నకు సుప్రియ అలీ పై సీరియస్ అయ్యింది ..అక్కినేని నాగేశ్వర రావు గారి గురుంచి ,నాగార్జున గారి గురుంచి ఎన్నో ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పిన సుప్రియ అలీ అడిగిన ప్రశ్నకు అలీ పై విరుచుకు పడింది ..అలీ అడిగిన ప్రశ్న ఏమి టంటే ...నీ వల్లే అక్కినేని ఫామిలీ కి ,దాసరి ఫామిలీ కి కొన్ని విభేదాలు వచ్చాయి అంట కదా అని అడిగితే దానికి వెంటనే సుప్రియ స్పందిస్తూ ..అలీ నువ్వు మరీ అంత ఓవర్ చేయకు అని ఘాటుగా జవాబు ఇచ్చింది ..దీనికి అలీ కాసేపు నోటి మాట లేకుండా షాక్ కి గురయ్యాడు ..చుసిన వారికి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది ...మొత్తానికి సుప్రియ అంతగా సీరియస్ అవడానికి అక్కడ ఏమి జరిగిందో తెలియాలి అంటే అలీ ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగాడో తెలియాలి అంటే ఈ షో టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే ..ఏది ఏమైనా అలీ వేసే ప్రశ్నలు ఎవరికీ ఇబ్బంది పెట్టె విధంగా వుండవు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ..మీరు కూడా ఈ షో కి అభిమానులు అయితే అలీ గారి గురుంచి ,అతని కామెడీ టైమింగ్ గురుంచి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో తెలియజేయండి ....

Comments