Great Composers Beethoven Ludwig van Biography

      స్వరాలతోనే శ్రోతల్ని ఊపేసే సంగీత విద్వాంసుడుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బీతోవెన్ చెవిటివాడా...?

       బీతోవెన్ పూర్తిపేరు లుడ్విక్ వాన్ బీతోవెన్.అతను జర్మనీలోని బాన్ నగరంలో 1770లో జన్మించాడు.నాలుగేళ్ళ  వయసులోనే సంగీతంలో మూడు సరికొత్త బాణీలని కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.అతని ప్రతిభని గుర్తించిన అతని తండ్రి జోహన్,ఆ బాల సరస్వతితో కచేరీలు చేయిస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చని భావించి,అతనితో కచేరీలు చేయించేవాడు.అలా వచ్చినడబ్బులతో తాగుడు తాగుతూ జల్సాలు చేసేవాడు బీతోవెన్ తండ్రి. కొడుకునేమో పియానోముందు గంటలు గంటలు కూర్చోబెట్టేవాడు .ఎప్పుడైనా చేతులు నొప్పిపుట్తి పియానో ప్రాక్టీస్ చేయడం ఆపేస్తే బీతోవెన్ ని దారుణంగా కొట్టేవాడు. తండ్రి పిడుగుద్దులు గుద్దుతూ తనని గాయపరుస్తున్నా,బీతోవెన్ మాత్రం పియానోని తప్పుగా వాయించేవాడుకాదు.దానిపై కొత్త కొత్త స్వరాల్ని కనిపెడుతూనే ఉండేవాడు. 8యేళ్లకే సంగీత ప్రదర్శన యివ్వగలిగే స్థాయికి ఎదిగి అందరి మెప్పునీ పొందిన బీతోవెన్  తాను కచేరీల ద్వారా సంపాదించిన డబ్బులో చిల్లిగవ్వకూడా తీసుకొనేవాడు కాదు.అదంతా తండ్రికే యిచ్చేవాడు కచేరీలేకాదు బీతోవెన్ ఖాళీ దొరికినప్పుడల్లా ధనవంతుల యిండ్లలోని పిల్లలకి  సంగీతపాఠాలు నేర్పుతూ వచ్చిన ఆ డబ్బుతో పొట్టనింపు కొనేవాడు.

      జీవితంలో ఎన్ని అవరోధాలు,ఒడుదుడుకులు ఎదురైనా సంగీత సాధన మాత్రం మానేవాడు  కాదు.రాత్రింబగళ్లూ సంగీత సాధనచేస్తూ కొత్త కొత్త బాణీలని కనిపెట్టేవాడు.రాత్రిళ్లు నిద్రరాకుండా ఉండేందుకై,రెండుగంటలకోసారి చన్నీటితో తల స్నానం  చేసేవాడు.అదే అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.1798లో అంటే అతనికి 28యేళ్ల వయస్సులో అతనికి ఫిట్స్ వ్యాధి వచ్చి,ఆ ఫిట్స్ కాస్తా చెవుడుగా మారిపోయి జీవితాంతం అతన్ని వేధించింది.చెవుడు రావడంతో డిఫ్రెషన్ కి గురి అయిన  బీతోవెన్, ముఖం నల్లగా  మారిపోయి,ముఖంపై స్పోటకపు మచ్చలు వచ్చేశాయి.రోజురోజుకీ చెవుడు ముదిరిపోవడంతో అందరిపైనా విపరీతంగా  కోప్పడుతూ  ఉండేవాడు. చేసే పనిపై  అసహనం పెరిగిపోయేది.చాలా సార్లు హోటల్ కి వెళ్లి సిబ్బందిపై అసహనంతో మాంసాహారాన్ని విసిరివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కచేరీచేసేటప్పుడు ఎవరైనా   సరిగ్గా వినకపోతే వారిపై కోప్పడి మధ్యలోనే ఆ కచేరీని ఆపేసి వెళ్లిపోవడాలు కూడా జరుగుతూ ఉండేవి.అప్పుడే అతను ఒంటరి జీవితానికి అలవాటు  పడ్డాడు .తలుపులూ కిటికీలు మూసేసుకొని,గదిలో ఒక్కడే ఉండడం అలవాటుగా మార్చుకున్నాడు.

     ఒంటరిగా ఉంటూ సంగీత సాధనే ప్రపంచంగా మార్చుకొని,కొత్తకొత్త బాణీలని కనిపెట్టి,ఆ బాణీలకి తానే పాటలు రాసుకుంటూ ఉండేవాడు.ఆ పాటల్ని తానేపాడుకుంటూ,తానుపాడిన ఆపాట తనకి వినిపించక పోవడంతో పాట పూర్తి అవ్వగానే కుమిలికుమిలి ఏడుస్తూ ఉండేవాడు. నిజం చెప్పాలంటే అతనికొచ్చిన ఆ చెవిటితనమే అతనిలో ఒక ఆవేశాన్నీ,ఉద్రేకాన్నీ తెచ్చింది.ఏదో సాధించాలనే తపనని రగిల్చింది. వినికిడి శక్తి లేకపోయినా మనసులోంచి పెల్లుబికి వచ్చే ఆవేశాన్ని స్వరాలుగా మార్చి,అతనుకట్తిన బాణీలు అతన్ని సంగీత ప్రపంచంలో శిఖరాగ్ర స్థాయికి చేర్చాయి.మెల్లమెల్లగా క్లాసికల్ మ్యూజిక్ కి చరమగీతంపాడి,రొమాంటిక్ సంగీతాన్ని కనిపెట్టి,రొమాంటిక్ సంగీత సృష్టికర్తగా మారాడు. రొమాంటిక్ సంగీతయుగానికి బీతోవెనే  ఆద్యుడు.. కచేరిల ద్వారా సంగీత ప్రియుల్ని ఉర్రూత లూగించిన బీతోవెన్ సంగీతంలో శిఖరసమానస్థాయికి చేరుకున్న తర్వాత,1827లో తన 57వయేట తనువు చాలించాడు.  బీతోవెన్ జీవితం విషాథాంతమే అయినా,సంగీత స్వరకర్తగా,రొమాంటిక్ సంగీత యుగానికి ఆద్యుడిగా మాత్రం బీతోవెన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.అతను కనిపెట్టిన రొమాంటిక్ సంగీతబాణీలు మాత్రం ఇప్పటికీ సంగీతప్రపంచంలో నిలిచి ఉండి అనేకమందికి  ఉపయోగపడుతూ ఉన్నాయి. చిన్న వయస్సునుంచే సంగీతంలో కొత్తకొత్తబాణీలని కనిపెట్టి ఎందరికో స్పూర్తిగా నిలిచి,సంగీతలో శిఖరాగ్రస్థాయికి చేరిన బీతోవెన్ ఇప్పటికీ చిరస్మరణీయుడే. 

Comments