రాహుల్ గాంధీకి పెళ్ళి ఎప్పుడు అయిపొయింది? వదువు ఎవరంటే..?

        "నా పెళ్లి ఎపుడో జరిగిపోయింది"....రాహుల్ గాంధీ ఫైనల్ ఆన్సర్

       జాతీయ కాంగ్రెస్ అద్యక్షుడు ఆజన్మబ్రహ్మచారి గానే మిగిలిపోనున్నాడా? రాహుల్ పెళ్లి ప్రస్తావనకు ఇక తెర పడిందా? అనే ప్రశ్నలకు సామధానాలు దొరికినట్టే...రాహుల్ పెళ్లి వ్యహారం నేటి వరకు చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది...ఎప్పుడు ప్రెస్ మీట్ లో అడిగినా, కాలేజీ ఫంక్షన్ అడిగినా, ఆఖరుకి సొంత పార్టీ నేతలే ఘాటుగా విమర్శించినా కూడా పెదవి విప్పని రాహుల్ చివరికి తన మనసులోని మాటని నిర్మొహమాటంగా బయట పెట్టాడు...నిజానికి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి, రాహుల్, అటు తల్లి సోనియా మనసుని నొప్పించకుండా ఇటు తన సొంత వ్యూహాన్ని రచిస్తూ రాజకీయ జీవితం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు రాహుల్...కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా అద్యక్షుడిగా తొలి ప్రసంగం తో ఒక విధంగా అందరి దృష్టిని ఆకర్షించినా కూడా చివరికి మోదీ మీద వ్యంగాస్త్రాలను సంధించాడు..దీంతో దేశ వ్యాప్తంగా రాహుల్ పై సీత కన్ను పడింది...

    సోషల్ మీడియా రాహుల్ ను వారం రోజుల పాటు ట్రోల్ చేసింది...నేతల చేతిలో విమర్శల పాలయ్యాడు రాహుల్... కానీ ఇవేమీ పట్టించుకోకుండా రాహుల్ తన కొత్త వ్యూహం తో ముందుకు నడుస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది...ఇదే నేపధ్యంలో హైదరాబాదు లో పర్యటనకు వచ్చిన రాహుల్ తన పంజా విప్పాడు.. గ్రౌండ్ లెవల్ లో పార్టీని బలోపేతం చేయడం కోసం పర్యటిస్తున్నారు...తాజగా జరిగిన మీడియా ఎడిటర్ల సమావేశం లో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేసారు...2019 లో మోడీ ప్రధాని అవ్వడం నాకల అంటూ ఎద్దేవా చేసాడు..మోడీ ఊహలలో బతుకుతున్నాడు...230 స్థానాల్లో గెలిస్తేనే మళ్ళీ పిఎం అవుతాడు అలా కాకుంటే పరిస్థితి తారుమారు అవుతుంది...కాబట్టి మోడీ ప్రధాని అయ్యే అవకాశమే లేదు...ప్రజల్లో తిరుగుబాటు, వ్యతిరేక మొదలయ్యింది,

       మోడీ 2019 ఎత్తి పరిస్థితుల్లో ప్రధాని అవ్వలేడు అని ఘాటు వ్యాఖ్యలు చేసారు...చివరిగా రాహుల్ పెళ్లి పై స్పందించారు...విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..." నాకు కాంగ్రెస్ పార్టీ తో ఏనాడో పెళ్లి జరిగిపోయింది" అని ఒకే వాక్యం తో ముగించారు రాహుల్..దీని బట్టి చూస్తే రాహుల్  తన జీవితాన్ని పార్టీకి అంకితం చేయనున్నారని వ్యాఖ్యతో బట్టబయలయింది...బ్రహ్మచారి గానే ఉంటూ, కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలబడి భీష్ముడి పాత్రను పోషించాబోతున్నాడని అర్ధమవుతోంది...ఇన్నాళ్ళు దాటవేసుకుంటూ వచ్చిన ప్రశ్నకు సమాధానం దొరకడంతో అటు రాజకీయ నేతలు ఇటు సామాన్య జనం ఆశ్చర్యపోతున్నారు... జవాబు రానున్న రోజుల్లో రాహుల్ కు ప్లస్ అవుతుంది అని ఒక వర్గ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... బ్రహ్మచారులుగా రాజ్యాలు ఏలిన వారికి ప్రజల అండదండలు ఉంటాయనే సెంటిమెంట్ తో ఈమాట అన్నాడా లేక అంతా ఉత్తదే అని మళ్ళీ ఇంకోసారి కన్ను కొడతాడా అనేది వేచి చూడాలి.....

Comments