దొంగకాదు కాని .. సైలెంట్ గా విమానమే ఎత్తుకెళ్ళిపోయాడు..!

           సూసైడ్ చేసుకోవడానికి విమానాన్ని దొంగతనం చేసి

        దొంగతనం పలు రకాలు, "కాదేది దొంగతనానికి అనర్హం" అనే మాటకు ఘటన సరిగ్గా సరిపోతుంది...ఎందుకంటే  బంగారం, భూములు, ఇంకా రకరాల దొంగతనాల గురించి చూసే ఉంటారు..కాని ఇలాంటి దొంగతనం ఎక్కడా చూసి ఉండరు...ఇక అసలు విషయానికి వస్తే,  అలాస్కా ఎయిర్‌‌లైన్స్లో పని చేసే ఉద్యోగి పనికి పూనుకున్నాడు... పియర్స్ కౌంటీకి చెందిన 29 ఏళ్ళ ఉద్యోగి, విమానాశ్రయంలో చిన్న మెకానిక్కుగ్రౌండ్ సర్వీస్ వింగ్లో పనిచేస్తుంటాడు...అమెరికా లొని సియాటెల్ సీటాక్ ఎయిర్పోర్టు లో శుక్రవారం రాత్రి  పదిగంటల సమయంలో అలస్కా ఎయిర్లెైన్స్కు చెందిన హొరైజాన్ అనే విమానం టేకాఫ్ అయింది. అయితే నిజానికి టైములో షెడ్యుల్ లేదు,  కానీ విమానం మాత్రం టేక్ ఆఫ్ జరిగింది దీనత్ అధికారులకు ఆలస్యంగా అనుమానం కలిగింది,   దీంతో ఒక్కసారిగా వాషింగ్టన్ ప్రభుత్వం స్తబించింది, ఉగ్రవాదులు ఎవరైనా వచ్చారా అన్న అనుమానం కలిగింది. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయ్యి  ఎయిర్ నేషనల్ గార్డుకు చెందిన రెండు జెట్ యుద్ధవిమానాలు  విమానాన్ని వెంబడించాయి. రకరకాల సందేహాలతో దాని వెంటపడ్డారుఒకవేళ టెర్రరిస్టు లింక్డ్ ఆపరేషన్ అయితే దాన్ని నాశనం చేయాలన్నదే వారి తక్షణ కర్తవ్యం లా మారింది. యుద్ధానికి సర్వం సిద్ధం అనేట్టుగా మారిపోయింది వ్యహారం. ఇక విమానానికి అటొక పైటర్, ఇటొక ఫైటర్ చేరి, అటాక్కు రెడీ అయ్యాయి. విమానం మరింత వేగంతో  ముందుకెళ్ళింది, కానీ కాసేపటికి అది సమీపంలో ఉన్న కెట్రాన్ అనే చిన్న ద్వీపంలో కూలిపోయింది, చివరికి అతను క్రాష్లో మరణించాడు...

         విమానం కూలిపోయినప్పుడు తనొక్కడే ఉన్నాడు అందులో, టెర్రరిస్టు ఆపరేషన్ కాదని తెలుసుకున్నారు అధికారులు. అయితే అతను విమానాన్ని ఒంటరిగా ఎత్తుకెల్లాల్సిన అవసరం ఎమోచ్చింది. అనే ప్రశ్నలపై ఆరా తీస్తున్నారు అధికారులు.  స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ అధికారులు, అందుబాటులో ఉన్న డేటాతో ఇంకాస్త విశ్లేషించే పనిలో, కారణాల అన్వేషణలో మునిగారు ఎఫ్బీఐ ఏజెంట్లు. అయితే విషయం తెలిసిన కొంతమంది అతను ఆత్మహత్య చేసుకోవడానికే అలా చేసి  ఉంటాడని అభిప్రాయపడుతున్నారు...చావడానికి విమానమే ఎత్తుకెళ్ళాలా అని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు....సీటెల్ - టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు  ఘటన ట్వీట్ద్వారా తెలియచేసారు.... 

 

 

Comments