భోజనం చేస్తున్నపుడు నీళ్లు తాగుతున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి

           భోజనం చేస్తున్నపుడు నీళ్లు తాగుతున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి 

       సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగిస్తుందని, జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని వీరంటారు. మరి నీరు ఎప్పుడు తాగాలి? భోజనానికి సరిగ్గా అరగంట ముందు నీరు తాగితే, మీరు తినే ఘన ఆహారాలకు తాగిన నీరు జీర్ణక్రియకు సహకరిస్తుంది. లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని, ఈ రకంగా తాగే నీరు, పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుందని, ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నీటిని అవసరం లేని సమయాలలో శరీరానికి అందించితే అది గ్యాస్ సమస్యలకు కూడా దోవతీయవచ్చంటున్నారు.

      రోజు మొత్తం మీద శరీరానికి నీటిని ఎలా అందించాలి? ఉదయం లేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగాలి. మధ్యాహ్నం లంచ్ సమయంవరకు నిర్దేశిత కాల వ్యవధితో మరో లీటర్ తాగాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొదలుపెట్టి సాయంకాలం స్నాక్స్ లేదా చిరుతిండి వరకు మరో లీటరు నీరు అప్పుడపుడూ, ఆపై రాత్రి డిన్నర్ లోపుగా మరో లీటర్ అంచెలవారీగా తాగితే మొత్తంగా నాలుగు లీటర్ల నీరు ప్రతిరోజూ శరీరానికి అందించినట్లవుతుందని. ఈ క్రమంలో తీసుకునే నీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవటానికి, రక్తంలో కలవటానికి, మరుసటిరోజు మలబద్ధకం ఏర్పడకుండా వుండటానికి సహకరిస్తుందని చెపుతున్నారు అజీర్తి, మలబద్ధకం,మొలలు, గాల్బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు క్రమం నీరు తీసుకోవడం వల్ల తొలగిపోతాయి.

     భోజనానికి ఒక అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒక గ్లాసు నీరు తాగవచ్చు.కాని భోజనం చేస్తున్నప్పుడే మధ్య మధ్య లో నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు  కలిగే ప్రమాదముంది. అదెలా అంటే-మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కొన్ని జీర్ణరసాలు తయారవుతుంటాయి.భోజనము చేసేటప్పుడో లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల ఆ జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. ఇది అజీర్తి,మల బద్ధకం,కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.అలాగే కొంత మంది అదే పనిగా రోజుకు 6-7 లీటర్ల నీరు తాగుతుంటారు. దీనివల్ల ఆ నీటిని తిరిగి బయటకు పంపించడంలో మన కిడ్నీలపై అనవసర భారం పడుతుంది.తద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.కాబట్టి ,మన శరీరానికి అవసరమయ్యే నీరు మూడు నుంచి నాలుగు లీటర్లే అని(మహా అయితే 5లీటర్లు), ఆ పరిమితి ప్రకారం తాగితేనే ఆరోగ్యకరమని అని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ పరిమితి కూడా వారి వారి జీవన విధానాలమీద ఆధారపడి ఉంటుంది.
 

Comments