ఒకే యువతిని ఇద్దరికిచ్చి పెళ్లి చేసినా రిజిస్టర్ ఆఫీసర్ షాక్ లో భర్త || Two Husbands Has One Wife

         ఒకే అమ్మాయిని ఇద్దరికిచ్చి పెళ్లి చేసినా రిజిస్టర్ ఆఫీసర్..వామ్మో ఏంటిది ?

      ఒకే యువతికి “సబ్ రిజిస్టర్” కార్యాలయాల్లో ఇద్దరు వ్యక్తులతో వివాహం చేసిన విచిత్ర ఘటన ఒకటి ఈమధ్య వెలుగు చూసింది. తన భార్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారని.. సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది నిర్లక్షం వలన తనకు అన్యాయం జరిగిందని.. మొదటి భర్త ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. పైగా వారి పెళ్లి సమయంలో తీసిన ఫోటోలు, వీడియో “సోషల్ మీడియా”లో పోస్టు చేయడంతో ఈ విచిత్ర ఘటన వైరల్ గా మారింది.. ఉత్తర కన్నడ జిల్లా, “ఆంకోళ” తాలుకా, “సుంకసాళ” నివాసి “గణపతి భట్” అనే యువకుడు.. యల్లాపుర యువతి(21) ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరి ముందే ఊహించి వారికి తెలీకుండా 2017 ఆగస్టు 15వ తేదీన స్నేహితుల సమక్షంలో “కారవార” తాలుకా, “ఆమదళ్ళి”లోని “శ్రీ వీరగణపతి దేవాలయం”లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలనుండి బెదిరింపులు వస్తుండడంతో ఈమద్యే 2018, ఫిబ్రవరి,7న “కారవార సబ్ రిజిస్టర్ కార్యాలయం”లో అధికారుల సమక్షంలో పూలదండలు మార్చుకుని.. వీరి వివాహన్ని అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నారు..

     ఆ సమయంలో యువతి తాను “యల్లాపుర” పట్టణంలోని “ఉద్దజడ్డి” వీదిలోని “కంప్లి అంతలు” ప్రాంతంలో నివాసం ఉంటున్నానని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చిరునామా ఇచ్చింది... అలా వారి పెళ్లి రిజిస్టర్ కావడంతో ప్రశాంతంగా కాపురం మొదలు పెట్టారు.. వీరిద్దరూ కాలేజీ రోజులనుండే ప్రేమించుకోవడంతో భార్య మీద “గణపతి భట్”కు ఎంతో నమ్మకం.. ఆమెమీద.. ఆమె ప్రవర్తన మీద ఎలాంటి అనుమానం రాలేదు. అలాగే ఈమధ్య ఆ యువతీ అమ్మానాన్నల ప్రవర్తనలో కొంత మార్పు కనిపించింది.. ఎక్కడున్నా ఇద్దరు హ్యాపీ గా బ్రతకండి అని నమ్మబలికారు... అప్పడే ఉద్యోగం కోసం “గణపతి” బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది.. దాంతో నువ్వు ఒంటరిగా ఉండలేవు కాబట్టి కొన్నాళ్ళు మీ పుట్టింట్లో ఉండు.. ఎలాగు మీఅమ్మానాన్నలు మనల్ని క్షేమించారు.. పైగా మన పెళ్లి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఎవ్వరు ఏం చేయలేరు.. ఉద్యోగం రాగానే నిన్ను కుడా అక్కడికే తీసుకెల్తా అని చెప్పాడు.. దాంతో సరే అన్న ఆ యువతీ పుట్టింటికి వెళ్ళిపోయింది.. ఉద్యోగం కోసం గణపతి బెంగళూరు వెళ్ళాడు.. ఇక్కడివరకు అంత బాగానే ఉంది..

    ఇప్పుడు అసలు స్టొరీ మొదలైది... ఉద్యోగం వచ్చినా ఆమె భర్త తిరిగిరావడం కొంత ఆలస్యం అయ్యింది.. పైగా ఉద్యోగ పనుల్లో బిజీగా ఉన్న గణపతి భార్యను కొంత నిర్లక్ష్యం చేసాడు.. అంతే అదే అదునుగా భావించిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీడు నీకు కరెక్ట్ కాదు... వీడికంటే అందగాన్ని డబ్బున్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తాం... 24గంటలు అతడు నీ పక్కనే ఉంటాడు.. ఇలా నిన్ను గాలికి వదిలేసే వెళ్ళేవాడు నీకు అవసరమా ? పైగా వాడిమాటలు వింటుంటే వస్తాడో రాడో అనే అనుమానం వస్తుంది.. వాడొక చీటార్ అంటూ కూతురుకు కౌన్సలింగ్ ఇచ్చారు.. అవన్నీ నిజమే అని నమ్మిన ఆ అమ్మాయి.. సరే మీ ఇష్టం అని చెప్పి రెండో పెళ్ళికి రెడీ అయ్యింది.. నిజానికి ఇవన్ని నేడు కామన్.. కాని మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడమే ఇక్కడా ఎవ్వరు ఊహించని ట్వీస్ట్... అదికూడా అధికారికంగా రెండోసారి కుడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఆ యువతీ.. పైగా రెండోసారి కుడా అదే అడ్రస్..

      అదే ఫోటో ఇచ్చనా కుడా ఈమెకు ఇదివరకే పెళ్లి అయ్యింది అని కనిపెట్టలేక పోయారు అధికారులు... తన భార్య పెళ్లి విషయం తెలిసి షాక్ అయినా గణపతి... “నాభార్యను గుట్టుచప్పుడు కాకుండా “రాజేష్ భట్” అనే మరో వ్యక్తితో పెళ్లి చేశారని, తనను మోసం చేశారని...” ఓ వీడియో తీసి, పెళ్లి సమయంలో, కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతితో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు... ఆతరువాత చేసేదిలేక మీరే న్యాయం చెయ్యాలని “గణపతి”, దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. దాంతో ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేస్తున్నారు పోలీసులు... ఇప్పుడు చెప్పండి ఈ విచిత్ర ఘటనలో తప్పు ఎవరిది. 

 

Comments