ఒక్కరితో పెళ్లి, ఇద్దరితో డేటింగ్ తరవాత జరిగింది తలుచుకుంటే |

                   ఒక్కరితో పెళ్లి, ఇద్దరితో డేటింగ్ తరవాత జరిగింది తలుచుకుంటే |

         కర్ణాకటలో ఓ మహిళా ఓ వ్యక్తి వ్యక్తిని వివాహం చేసుకొని అతనితో 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడిపోయింది. ఆ తరువాత మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తూ అతనితో డేటింగ్ లో ఉంది. అతను ఉండగానే ఏడాది క్రితం నుంచి మరో వ్యక్తితో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. అనుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తున్న ఇద్దరు ఓక రోజు ఆమె కోసం నడిరోడ్డు మీద గొడవ పడి కొట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు అసలు విషయం తెలుసుకొని సదరు మహిళాని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె ఆ ఇద్దరితో సహజీవనం చేసిన మాట వాస్తవమే అయిన వారిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకి లేదని ప్రస్తుతం మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న అని అతన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు.

      ఈ మొత్తం వ్యవహారం వెనుక జరిగింది ఏంటనే విషయాన్నీ పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో రంగస్వామి అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె 2010లో అతన్నుంచి విడిపోయింది. ఆపై 2015 వరకూ ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. గత సంవత్సరం ఆమె మూర్తి అనే ట్రాక్టర్ డ్రైవర్ తో కనిపించడంతో రమేష్ కూడా దూరమయ్యాడు. గత ఏడాదిగా మూర్తితో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సిద్ధరాజు అనే వ్యక్తి ఆమెకు పరిచయమై పెళ్లి చేసుకుందామని చెప్పాడు. సిద్ధరాజుతోనూ సహజీవనం ప్రారంభించిన ఆమె, గత వారంలో బెంగళూరు – పుణె జాతీయ రహదారిపై తుముకూరు వద్ద కలసి ఉండగా, మూర్తి చూశాడు. ఆపై వారిద్దరి మధ్యా గొడవ జరిగింది. ఇప్పుడా యువతి ఇద్దరికీ హ్యాండ్ ఇచ్చి మరో వ్యక్తికి జెండా ఊపడంతో ఇప్పుడు వాళ్లిద్దరూ ఫుల్ షాక్ అయ్యారు. మొత్తానికి భర్తని వదిలేసిన తర్వాత ముగ్గురుతో సహజీవనం సాగించి వారికి హ్యాండ్ ఇచ్చి నాలుగో వ్యక్తితో సహజీవనానిని రెడీ అయినా ఈ అభినవ స్త్రీని చూసి అందరూ షాక్ అవ్వడం విశేషం.
 

Comments