మహేష్ బాబు మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది | Mahesh Babu Maharshi First Look Teaser Review

            మహేష్ బాబు మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది |

      మహేష్ బాబు అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ తన 25 వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమి పెడతారా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో, తన 25వ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ సూపర్ ట్రీట్ ఇచ్చారు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్‌ను అర్ధరాత్రి విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. గత వారం రోజులుగా మహేష్ 25వ చిత్రానికి సంబంధించిన సర్ప్రైజ్లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. ఈ చిత్రంతో వినూత్న ప్రచారానికి తెరతీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో ఆంగ్ల అక్షరం విడుదల చేస్తూ..

      అభిమానుల మెదడుకు పనిచెప్పారు. ముందుగా.. ‘R’ అనే లెటర్ని విడుదల చేసి.. తరువాత 'I', 'S', ‘H’ లెటర్స్‌ను రివీల్ చేశారు. తాజాగా చివరి లెటర్ ‘I’ని రివీల్ చేశారు. దీంతో మహేష్ మహేష్ 25 మూవీ టైటిల్ RISHI (రిషి) అనుకున్నారంతా.. అయితే ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తూ.. రిషి అనేది ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు మాత్రమే అని అసలు టైటిల్ ‘మహర్షి’ అంటూ ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ రోజు ఆగస్టు 9 గురువారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మహర్షి అని టైటిల్ ని కూడా రివీల్ చేసారు. ఈ సినిమాకి రిషి అని టైటిల్ పెడుతున్నారని ప్రచారం సాగింది. బ్లాక్ బస్టర్ హిట్ అయినా భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావటంతో అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ తన 25 వ సినిమా కావటంతో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. లేటెస్ట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని చూస్తే ఎన్నో విషయాలు అర్ధం అవుతాయి.మహేష్ 25 వ సినిమాకి రిషి అని టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. అయితే మహేష్ కి రెండు అక్షరాల సినిమా పేర్లు అచ్చి రావని గత సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. మూడు అక్షరాల టైటిల్ బాగా కలిసి వచ్చింది. అందుకే మూడు అక్షరాలతో మహర్షి అని పేరుని ఫిక్స్ చేసారు.

          ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా విభిన్నంగా ఉంటుందని మొదటి నుంచి చెప్పుతున్నారు.ఫస్ట్ లుక్ చూడగానే అది నిజమే అని అనిపించింది. పక్కా కాలేజ్ కుర్రాడి గెటప్ లో ఉన్న మహేష్ బాబు పది సంవత్సరాలు చిన్నగా కనిపిస్తున్నాడు. అంతేకాక సినిమాలో ఎక్కువ భాగం హాఫ్ హ్యాండ్ షర్ట్ తో కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. మహేష్ ఎక్కువగా సినిమాల్లో ఫుల్ హ్యాండ్ షర్ట్ తోనే నటించేవాడు.ఒకవేళ హాఫ్ హ్యాండ్ వేయవలసి వస్తే రౌండ్ నెక్ టీ షర్ట్స్ వేసుకొనేవాడు. ఆ సేంట్ మెంట్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు హాఫ్ హ్యాండ్ షర్ట్ ని ఈ మహర్షి సినిమాలో వేసుకుంటున్నాడు. కాలేజ్ కుర్రాడు అంటే చేతిలో పుస్తకం ఉండాలి. అయితే ఇక్కడ మహేష్ బాబు కాబట్టి చేతిలో లాప్ టాప్ తో హల్ చల్ చేస్తున్నాడు. షూ విషయంలో కూడా శ్రద్ద పెట్టినట్టు అర్ధం అవుతుంది.జీరో సోల్ ఉన్న కాన్వాస్ షూ ఉపయోగించాడు. బాగా పెరిగిన జుట్టును రివర్స్ ట్రెండ్ లో దువ్వేసి మీసం,గడ్డంతో న్యూ లుక్ తో మహేష్ కనపడుతున్నాడు.తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో మహేష్.. కాలర్ ఎగరేస్తూ ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న లుక్ కిర్రాక్ అనిపిస్తుంది. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. దిల్‌రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘మహర్షి’. 
 

Comments