సొంత చెల్లి అని కూడా చూడకుండా ఈ నీచుడు ఏంచేసాడో చూడండి |

                    సొంత చెల్లి అని కూడా చూడకుండా ఈ నీచుడు ఏంచేసాడో చూడండి |

      తమిళనాడులోని రామనాథపురం జిల్లా పనైకులం ప్రాంతానికి చెందిన దినేశ్‌కుమార్ ఎంసీఏ చదివాడు. అక్కడే తన బంధువైన మహిళ ఇంటికి ఓసారి విందుకు వెళ్లాడు. ఆమె విదేశాల్లో పనిచేసే తన భర్త పంపిన సెల్‌ఫోన్‌ను దినేశ్‌కుమార్‌కు ఇచ్చింది. అందులో వాట్సాప్ వంటి యాప్‌లు డౌన్లోడ్ చేసివ్వమని అడిగింది. ఇదే అదనుగా ‘ట్రాక్ వ్యూ’ అనే యాప్‌ను అందులో నిక్షిప్తం చేసిన దినేశ్.

    దాని ద్వారా ఆమె ఫోనును తన సెల్‌ఫోన్ ద్వారా నియంత్రించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. తద్వారా ఆ మహిళ తన భర్తతో మాట్లాడే వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు వంటి వాటిని సేకరించి ల్యాప్‌టాప్‌లో భద్రపరిచాడు. ఇటీవల లైంగిక వాంఛ తీర్చాలని, లేకుంటే వాటన్నింటినీ అంతర్జాలంలో పెడతానని ఆమెను బెదిరించాడు. భయాందోళనలకు గురైన బాధితురాలు విషయాన్ని తన సోదరుడికి తెలిపింది. ఆయన తన సోదరి పంపుతున్నట్లుగా ఫలానా చోటుకు వస్తే ఏకాంతంగా కలుసుకోవచ్చని దినేశ్‌కు సందేశం పంపారు. నిజమని నమ్మిన దినేశ్ సదరు ప్రాంతానికి చేరుకున్నాడు.

     అతడిని చూసిన బాధితురాలి సోదరుడు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దినేశ్ ఆ మహిళకు వరసకు తమ్ముడు కావడమే దీనికి కారణం. వెంటనే అతగాడికి దేహశుద్ధి చేసిన వారు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దినేశ్‌కుమార్ ఇంట్లో పోలీసులు సోదా చేసి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్ఫోన్లు, మహిళల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సాగిన దర్యాప్తులో దినేశ్‌కుమార్ తన బంధువులైన మహిళలు, స్నేహితుల సెల్ఫోన్లు చూసినట్లుగా నటించి వాటిలో ‘ట్రాక్ వ్యూ’ యాప్ డౌన్లోడ్ చేసినట్లు వెల్లడైంది. అలా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. దాన్ని అడ్డుపెట్టుకుని కొందరు మహిళలను బెదిరించి అత్యాచారానికి కూడా పాల్పడినట్లు తేలింది. బెదిరింపులకు లొంగని మహిళల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీయులకు విక్రయించినట్లు తెలిసింది. సొంత చెల్లెలు భర్తతో మాట్లాడిన సంభాషణలు, ఏకాంతంగా ఉన్న ఫొటోలను కూడా దినేశ్ సేకరించడం విశేషం. మొత్తంగా టెక్నలాజి వలన ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ.

Comments