కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..? | Karunanidhi Vs Jayalalitha

            కరుణానిధి తీసుకున్న ఆనిర్ణయమే జయలలితను CMను చేసింది లేదంటే..?

      నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తా..! నా విశ్రాంత జీవితం ఎప్పుడు మొదలవుతుందో నాకే తెలియదు. క్రియాశీల రాజకీయాల నుంచి నేను విరమించుకునేది లేదు అంటూ ఎన్నోసార్లు తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చాడు కరుణానిధీ... అలాంటి ఆయన చివరికి తనమాట నిలబెట్టుకున్నారు..! ద్రవిడ వాదం నినాదంగా.. హేతువాదం పునాదిగా.. దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు.. సుదీర్ఘ రాజకీయానుభవ ప్రతిభా సంపన్నుడు.. తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి.. ప్రత్యర్ధులెవరైనా లెక్క చేయకుండా ఎదురొడ్డి ఢీకొట్టిన వ్యూహచతురతా చాణక్యుడు... చివరిస్వాస వరకు క్రియాశీల రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూనే... 94 ఏళ్ల నిండు వయసులో కన్నుమూశారు. ఆయన అస్తమయంతో దేశ రాజకీయాల్లో ఒక తరం వెళ్లిపోయిందనే చెప్పాలి.. తమిళనాట అయన అభిమానుల హృదయాలు చిన్నబోయాయి. డీఎంకే అధినేతగా అర్థశతాబ్దంపైగా విస్తరించిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు కరుణానిధి..

   తన జీవితంలో ఎన్నడూ, ఏ ఎన్నికలోనూ ఓటమి అనేదే చూడలేదు..! కళలకూ రాజకీయాలకూ మధ్య అరుదైన అద్భుత వారధిగా నిలిచిన కరుణానిధి అస్తమయంతో ఒక యుగం, ఒక శకం ముగిసిందనే చెప్పాలి.. అలాంటి గొప్ప లీడర్ అయినా “కరుణానిధీ” క్రియాశీల రాజకీలయాల్లో చేసినా ఒకేఒక్క తప్పు స్వర్గీయ జయలలితను తమిళనాట ముఖ్యమంత్రిని చేసిందని అందరికి తెలిసిన ఓపెన్ సెక్రెట్.. అదేంటంటే “కరుణానిధీ” స్వతహాగా మంచివాడే అయినా...

   జయలలిత విషయంలో మాత్రం ఆడదే కదా అని తక్కువ చేసి చూసాడు.. అందుకే MGR మరణం సమయంలో కొందరు “అన్నా DMK” నాయకులతో చేతులు కలిపి.. అసేంబ్లి సాక్షిగా పబ్లిక్ గా జయలలిత చీర లాగి అవమానించాడని అందరు చెప్పుకుంటారు.. అక్కడే జయలలితా, కరుణానిధీ ఊహించని నిర్ణయం తీసుకుంది.. నేను ముఖ్యమంత్రిని అయ్యేవరకు అసేంబ్లిలో అడుగు పెట్టాను అని శపథం చేసింది.. దాంతో తమిళనాడు ప్రజల్లో ఆమెకు సింపతి మొదలైది.. దానికి ఆమె సిని గ్లామర్ కుడా తోడయ్యింది.. అలా చివరికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చింది జయలలిత.. CM చైర్ లో కుర్చుందో లేదో వెంటనే తనను అవమానించిన కరుణానిధీని పబ్లిక్ గ్గా అందరు చూస్తుండగానే లాక్కెళ్ళి జైల్లో పెట్టించింది.. దాంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఆక్షణం నుండి రాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత.. చివరికి తమిళనాడు రాష్ట్ర న్నే శాశించే రేజ్ కి ఎదిగింది... లేదంటే ఆమె “అన్నా DMK” పార్టీ కార్యకర్త గానే తన జీవితాన్ని ఎండ్ చేసేది అంటారు తమిళనాడు రాజకీయ విశ్లేషకులు.. అలా కరుణానిధీ తీసుకున్న ఒక్క నిర్ణయం జయలలితలోని విప్లవ కారిణిని బయటకు తీసుకొచ్చి ఆమెను ముఖ్యమంత్రిని చేసింది.. 

Comments