మద్రాసు హైకోర్ట్ చారిత్రకతీర్పు. కరుణానిధీ అత్యక్రియలు మెరీనా బీచ్ లోనే || Karunanidhi Breaking News

        మద్రాసు హై కోర్ట్ సంచలన తీర్పు.. కరుణానిధీ అత్యక్రియలో “మెరీనా బీచ్‌”లోనే.

      తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గత సాయంకాలం చనిపోయిన విషయం తెలిసిందే.. అయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపే స్థల వివాదంపై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కరుణానిధి అంతిమ సంస్కారాలు “మెరీనా బీచ్‌” లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని స్టాలిన్ అధ్వర్యంలో డీఎంకే అర్దరాత్రి హైకోర్టును ఆశ్రయించింది. దాంతో అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది. చివరకు డీఎంకే పార్టీ చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది.. ఈరోజు ఉదయం 8 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి “మెరీనా బీచ్‌”లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి “కామరాజ్‌ నాడార్‌” చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని..

        ఆయనకు అంతిమ సంస్కారాలకు “మెరీనా బీచ్‌”లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్ను మూసినందునే వారికి “మెరీనా బీచ్‌”లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు “గిండి”లో 2ఎకరాల స్థలం కేటాయించినట్లు వెల్లడించింది. ఇక కోర్ట్ ఆదేశాలను స్టాలిన్ బృందం పూర్తిగా వ్యతిరేకిస్తుంది... “మానాన్న రాజకీయ చరిత్ర తెలిసి కుడా “అన్నా DMK” ప్రభుత్వం కావాలనే మా తండ్రిని అవమానిస్తుందని... “మెరీనా బీచ్‌”లో మానాన్న అత్యక్రియలు జరగడమే అతడికి సరైనా నివాళి అని స్టాలిన్ ఆరోపిస్తున్నాడు.. నిజానికి అతడి ఆరోపణలో కుడా నిజం ఉంది.. ఎందుకంటే కరుణానిధీ 13 సార్లు MLA గా గెలిస్తే ఏకంగా 5 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.. ఇంత సుధీర్గ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు దేశంలోనే లేడు అని చెప్పాలి...

       వీల్ చైర్ లోనే ఉండి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనత కరుణానిధీ సొంత అంత గొప్ప లీడర్ ని ఇలా అవమానించం ఏంటి అని చాలామందే వ్యతిరేకిస్తున్నారు.. కాని “అన్నా DMK” ప్రభుత్వం మాత్రం స్టాలిన్ కావాలనే తన తండ్రి శవంతో రాజకీయం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు... ఇదిలాఉంటే “మద్రాసు హై కోర్ట్” లో జరిగినా సుధీర్గ చర్చల తరువాత కరుణానిధీ అత్యక్రియలు “మెరీనా బీచ్‌”లోనే జరగాలని... అదికూడా “DMK” నేతలు కోరినట్లుగా “అన్నాదురై” పక్కనే కరుణానిధీని సమాది చేయాలని సంచలన తీర్పునిచ్చింది.. దాంతో “DMK” నేతలు సంతోషం వ్యక్తం చేసారు.. ఇప్పుడు చెప్పండి ఎవరు కరుణానిధీ మరణాన్ని రాజకీయం చేస్తుంది ? తమిళనాడు “హై కోర్ట్” ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి ? కరుణానిధీ అత్యక్రియలు ఎక్కడ జరిగితే అతడికి సరైనా “నివాళి” అని మీరనుకుంటున్నారు ? మీ అభిప్రాయాన్ని కుడా కామెంట్ చేయండి..

Comments