Skip to main content

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ Vs హైపర్ ఆది వీరిద్దరి లో ఎవరు బెస్ట్| Sudigali Sudheer Vs Hyper Aadi

            జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ Vs హైపర్ ఆది వీరిద్దరి లో ఎవరు బెస్ట్|

     టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి వచ్చినంతగా ఏ షో కి అంతలా హైప్ మరియు రేటింగ్స్ రాలేదు. జబర్దస్త్ షో అనగానే సుడిగాలి సుదీర్,హైపర్ అది గుర్తుకు వస్తారు. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్యాన్స్ పరంగా చూస్తే ఆది కన్నా సుడిగాలి సుదీర్ కే ఎక్కువ ఉన్నారు. ఆది కన్నా సుదీర్ సీనియర్ కావటం ఒక కారణం కావచ్చు. సుదీర్ ని ఎంత మంది ఇష్టపడతారో, అలాగే ఆది పంచ్ లను కూడా అంతే మంది ఇష్టపడతారు. ఇక సుదీర్ కి ఆదికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే సుదీర్ తన మీద తానే జోక్స్ వేసుకొని నవ్విస్తాడు. హైపర్ ఆది అయితే టీమ్ లో ఉన్నవారి మీద జోక్స్,పంచ్ లు వేసి నవ్విస్తూ ఉంటాడు.ఇక్కడ కూడా సుదీర్ కే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. సుదీర్ కి అన్ని వర్గాల నుండి ఫాలోయింగ్ ఉంటుంది.

     సుదీర్ తన స్కిట్స్ తాను రాసుకోలేడు. హైపర్ ఆది తన స్కిట్స్ తానే రాసుకుంటాడు.ఇక్కడ మాత్రం అదిదే పై చేయి. ఇక కామెడీ టైమింగ్ చూసుకుంటే ఆదికి అదే ప్లస్. సుదీర్ కూడా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి అన్ని షోస్ చేస్తున్నాడు . ఇక డాన్స్ విషయానికి వస్తే ఆది కన్నా సుదీర్ బెస్ట్. ఈ రకంగా విశ్లేషణ చేస్తే ఆది కన్నా సుదీర్ బెస్ట్ అని చెప్పవచ్చు.ఈ జీవితం ఎవరిని ఏ వైపుకు తీసుకువెళ్ళుతుందో ఎవరికీ తెలియదు. కష్టాలు ఎప్పుడు వచ్చిన దాని వెనక విజయం ఉంటుంది. ఆ విజయాలను అందుకొని మన పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా ముందుకు సాగితేనే విజయం వెంట ఉంటుంది. దానికి ఉదాహరణగా సుడిగాలి సుదీర్ ని చెప్పవచ్చు. రామోజీ ఫిలిం సిటీలో పర్యాటకులకు ఆనందాన్ని కలిగించే మ్యాజిక్ చేసే మెజీషియన్, అదే

    రామోజీరావు నిర్వహించే ఒక ఛానల్ లో ప్రధాన కమెడియన్,యాంకర్ గా మారతాడని ఎవరైనా ఊహిస్తారా? కలలో,సినిమాల్లో జరిగే ఇటువంటి పరిణామాలు సుడిగాలి సుదీర్ కి ఎదురయ్యాయి. బ్రతకటానికే చాలా కష్టపడిన రోజుల నుంచి ఇప్పుడు కమెడియన్ గా లక్షలు సంపాదించే వరకు ఎదిగాడు సుదీర్.సుడిగాలి సుదీర్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కళింగ పట్నం మండలం ఆచంట గ్రామం. 1987 మే 19 న రామస్వామి,లక్ష్మి దంపతులకు సుదీర్ జన్మించాడు. సుదీర్ తండ్రి ఉపాధి నిమిత్తం విజయవాడ వలస వచ్చారు. సుదీర్ విజయవాడలో ఇంటర్ మీడియేట్ ఎంపీసీ చదివాడు.

      కుటుంబ పోషణ కష్టం అవ్వటం,చదువు మీద ద్యాస తగ్గటంతో సుదీర్ హైదరాబాద్ పయనం అయ్యాడు. హైదరాబాద్ లో మెజీషియన్ విద్య నేర్చుకొని చాలా రోజుల పాటు వీధులలో షోస్ చేసేవాడు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మేజిక్ షో లు నిర్వహించేవాడు.ఆ సమయంలోనే సుదీర్ లోని టాలెంట్ గమనించిన కమెడియన్ వేణు జబర్దస్త్ లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వేణు సైడ్ అయ్యిపోవటం సుదీర్ టీమ్ లీడర్ అవ్వటం చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం సుదీర్ ఒక పక్క టివి రంగంలో అనేక షో లు చేస్తూ మరో పక్క కమెడియన్ గా సినిమా రంగంలోనూ బిజీగా ఉన్నాడు. చదువు మధ్యలోనే ఆపేసిన కష్టపడి పైకి వచ్చి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సమయం వచ్చినప్పుడల్లా సుదీర్ తన గతం గురించి చెపుతూనే ఉంటాడు.
 

Comments

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ Vs హైపర్ ఆది వీరిద్దరి లో ఎవరు బెస్ట్| Sudigali Sudheer Vs Hyper Aadi

posted onAugust 8, 2018
by sumantv

Tags

sudigali sudheer hyper aadi sudigali sudheer skits Hyper Aadi Skits aadi skits sudheer rashmi