కరుణానిధి ఇంటిదగ్గర గందరగోళం పరుగెడుతున్నపోలీసులు| Huge Crowd at Karunanidhi House at Chennai

                 కరుణానిధి ఇంటిదగ్గర గందరగోళం పరుగెడుతున్నపోలీసులు|

     డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణ మృతి విషయం తెలియగానే పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఆయన మృతి విషయం తెలియగానే అభిమానులు సొమ్మసిల్లిపడిపోయారు.ఆయన ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండు రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. వయోభారం కారణంగా చికిత్సకు శరీరం సహకరించడం లేదన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసినప్పటి నుంచే కార్యకర్తలు తరలి వచ్చారు.డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ మృతితో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

       కావేరి ఆస్పత్రితో పాటూ డీఎంకే ఆఫీస్, కరుణానిధి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులు హాజరుకావాలని ఆదేశించడంతో.. బలగాలన్నీ చెన్నైకు చేరుకున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా మద్యం షాపుల్ని కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సినిమా థియేటర్లకు కూడా బంద్ ప్రకటించారు. అలాగే తమిళనాడుకు వెళ్లాల్సిన బస్సు సర్వీసుల్ని కూడా నిలిపివేశారు. రాష్ట్ర డీజీపీ భద్రతను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే బుధ, గురువారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. కరుణ ఇకలేరని తెలియగానే కావేరీ ఆస్పత్రి దగ్గరకు అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివస్తుండంతో.. అక్కడ కూడా అదనపు బలగాలను మోహరించారు.

      అభిమానుల రాకతో కావేరీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ఎస్పీలను కూడా చెన్నైకు పిలిపిస్తున్నారు. అయితే తమ నేత తిరిగి కోలుకుంటారని అన్ని ఆరోగ్యపరమైన అడ్డంకులను అధిగమించి విజేతగా నిలుస్తాడంటూ ఆసుపత్రి ముందు కొందరు అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. భారీ సంఖ్యలో మహిళలు కూడా ఆసుపత్రి ముందు రోదిస్తూ కూర్చున్నారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో చెన్నైలో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అభిమానుల తాకిడి పెరగటంతో ఆసుపత్రి ముందు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కరుణ కుటుంబ సభ్యులు, డీఎంకే ముఖ్యనేతలు ఆసుపత్రిలో ఇప్పటికే కరుణ పార్థీవ దాన్ని ఇంటికి తరలించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ...

Comments