కరుణానిధి ఇక లేరు..శోకసంద్రంలో తమిళనాడు | DMK Chief M Karunanidhi Passes Away At 94

           కరుణానిధి ఇక లేరు..శోకసంద్రంలో తమిళనాడు

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కొద్దీ సేపటి క్రితం  విషమించింది. గత కొద్దీ rojulu gaa  కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణ ఆరోగ్యం మరింత క్షీణించడం తో కొద్దీ సేపటి క్రితం తుది శ్వాస విడిచినట్టు  వైద్యులు తెలిపారు.  వయసు సమస్యల దృష్ట్యా కరుణానిధి శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం ఇబ్బందిగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత కొద్దీ రోజులుగా  అనారోగ్యంతో బాధ పడుతూ  కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జులై 28న ఆయన ఆరోగ్యం విషమించడంతో కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మూత్ర పిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్, రక్తపోటు పడిపోవడంతో కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు.

      అప్పటి నుంచి ఆయణ్ని కావేరీ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై బెంగతో ఆయన అస్వస్థతకు గురైన నాటి నుంచి నేటి వరకు మొత్తం 25 మందికి పైగా అభిమానులు ప్రాణాలు విడిచినట్లు ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు. ఈ మరణ వార్త విని ఎంత మంది చనిపోతారో అని స్టాలిన్ విచారణ వ్యక్తం చేస్తున్నారు ..తమ ప్రియతమ నేత ఆస్పత్రి పాలయ్యారని తెలిసి నాటి నుంచి డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు తీవ్రంగా ఆందోళన తో  . కావేరీ ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు..

      తమిళనాడు సీఎం పళనిస్వామి సేలం పర్యటనను రద్దు చేసుకొని చెన్నై బయల్దేరారు. కరుణానిధి కుటుంబ సభ్యులు  ఇప్పటికే కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో చెన్నై నగరం అంతా హై అలర్ట్ ప్రకటించారు.  డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆస్పత్రి బయట భారీ గా చేరుకున్న డీఎంకే కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానుల ఆందోళనతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ఆసుపత్రి వద్దకు అభిమానులు చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. కార్యకర్తలు ఎలాంటి అవాఛనీయ ఘటనలకు పాల్పడవద్దని పోలీసులకు సహకరించాలన్నారు స్టాలిన్.తమిళ నాడు రాజకీయాల్లో జయలలిత తర్వాత చక్రం తిప్పిన నేత కరుణానిధి .ఇప్పటికే కరుణానిధి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు ..పలువురు పార్టీ కార్య కర్తలు ,రాజకీయనాయకులు విషయం తెలిసిన వెంటనే ఆయన చివరి పార్ధీవ దేహాన్ని దర్శించుకునేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు .. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కావేరీ ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రజనీకాంత్, విజయ్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు స్టాలిన్ ను ,వారి కుటుంభం సభ్యులను పరామర్శించినవారిలో ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి kalagali అని మనము కోరుకుందాం ....మీరు కూడా ఆయన ఆత్మకు శాంతి kalagali అని కోరుకుంటే RIP అని కామెంట్ లో తెలియజేయండి ..
 

Comments